లావణ్యతో పెళ్లి - వరుణ్ పెట్టిన పోస్ట్ వైరల్

Varun Tej post after marriage

టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంటర్ అయిన లావణ్య త్రిపాఠి తో మిస్టర్ మూవీ చేస్తున్నప్పుడు ప్రేమలో పడిన మెగా హీరో వరుణ్ తేజ్ ఐదేళ్లుగా ప్రేమించుకుని ఫైనల్ గా ఈ ఏడాది నవంబర్ 1 న పెళ్లి చేసుకున్నారు. మిస్టర్ మూవీ ఇటలీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రేమ పుట్టడంతో అదే ఇటలీ వేదికగా వరుణ్ తేజ్-లావణ్యలు ఒక్కటయ్యారు. ఇటలీలో మెహిందీ వేడుక, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఫంక్షన్స్, హల్దీ వేడుకలతో పాటుగా అక్కడ పెళ్లి కూడా గ్రాండ్ గా చేసుకుంది ఈ జంట.

ఇటలీలోని చిన్నపాటి రిసెప్షన్ ని పూర్తి చేసుకున్న వరుణ్-లావణ్యలు గత రాత్రి హైరాబాద్ లోనూ ప్రముఖులు, మీడియా మధ్యన మరో రిసెప్షన్ చేసుకుంది. ఇక పెళ్లి పనులతో గత వారం రోజులుగా వరుణ్-లావణ్యలు ఫుల్ బిజీగా మారిపోయారు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ మొదటిసారిగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 🖤 గుర్తుతో పెట్టిన ఫోటో చూసిన వారు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వరుణ్ అండ్ లావణ్య వెడ్డింగ్ వేడుకల కోసం వైట్ అవుట్ ఫిట్ లో కనిపించిన పిక్ అది.

Varun Tej post after marriage with Lavanya Tripathi went viral

varun tej