BB7: ఈ వారం ఎలిమినేట్ అతనే..
BB7: Tasty Teja Gets Eliminatedబిగ్ బాస్ ప్రతి సీజన్ లోకి ఈటివి జబర్దస్త్ నుంచి ఎవరో ఓ కమెడియన్ అడుగుపడుతూ ఉంటారు. గతంలో ముక్కు అవినాష్, చలాకి చంటి, ఫైమా ఇలా చాలామంది వచ్చారు. తమ టాలెంట్ చూపిస్తూ పారితోషకాలు పరంగా భారీగా పట్టుకుపోయారు. ఈ ఏడో సీజన్ లోకి జబర్దస్త్ నుంచి ఓ కమెడియన్ అడుగుపెట్టాడు. అతనే టేస్టీ తేజ. అదిరే అభి టీమ్ లో కామెడీ చేసే తేజ.. బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టి తో స్నేహం చేస్తూ కామెడీతో నెట్టుకొస్తున్నారు. టాస్క్ పరంగా వీక్ గా ఉన్నాడు.
గత రెండుమూడు వారాలుగా టేస్టీ తేజ నామినేట్ చేసిన వాళ్ళు వరసగా ఎలిమినేట్ అవడం పట్ల కొంతమంది తేజపై ఆగ్రహంగా ఉన్నారు. అటు హౌస్ లోను, ఇటు బయట కూడా తేజపై చాలామంది కోపంగానే ఉన్నారు. ఇక తేజ టాస్క్ ల పరంగా చాలా వీక్. అలాంటివాడిని ఎన్నిసార్లు నామినేషన్స్ లోకి వచ్చినా బిగ్ బాస్ కాపాడుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామిషన్స్ లో ఉన్నారు. మరి ఈ తొమ్మిదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది సస్పెన్స్ గా మారింది.
అయితే ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ అప్పుడే ముగిసిపోవడం, ఆ సండే ఎపిసోడ్ హైలైట్స్ లీకవడం జరిగిపోయాయి. అందరిని సిల్లీ నామినేషన్స్ తో ఎలిమినేషన్ కత్తి మీదకి పంపించిన టేస్టీ తేజ ఫైనల్ గా ఈ తొమ్మిదో వారం ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. అతనికి తక్కువ ఓట్స్ వచ్చిన కారణంగా అతన్ని ఈవారం పంపించేశారు. గత మూడు రోజులుగా తాను ఎక్కడ ఎలిమినేట్ అవుతానో అని భయపడుతున్నట్టుగానే తేజ ఈవారం ఎలిమినేట్ అయ్యి నాగార్జున తో స్టేజ్ పై నిలబడినట్లుగా తెలుస్తుంది. మరి గతవారం శోభా బ్యాచ్ నుంచి సందీప్ ఎలిమినేట్ అవగా ఈవారం తేజ ఎలిమినేట్ అవడం ఆ సీరియల్ బ్యాచ్ కి పెద్ద షాకే.
Bigg Boss Telugu 7: 9th Week Eliminated Contestant Tasty Teja







































