Advertisementt

కొత్తింట్లోకి కాజల్ అగర్వాల్

Sun 29th Oct 2023 05:29 PM
kajal aggarwal  కొత్తింట్లోకి కాజల్ అగర్వాల్
Kajal Aggarwal new house Pics కొత్తింట్లోకి కాజల్ అగర్వాల్
Advertisement
Ads by CJ

పెళ్లి తర్వాత కూడా షూటింగ్స్ చేస్తూ కెరీర్ లో బిజీ లైఫ్ ని గడుపుతున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భగవంత్ కేసరి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత ఆమె ముందుగా ఆచార్య, ఇండియన్ 2 షూటింగ్స్ చేసినప్పటికీ ఆ తర్వాత ఒప్పుకున్న భగవంత్ కేసరి సినిమానే ముందుగా విడుదలైంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ట్రెడిషనల్ గా కాత్యాయనీ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా బాలయ్య పక్కన కాజల్ చక్కగా కనిపించింది.

అయితే తాజాగా కాజల్ అగర్వాల్ భార్య గౌతమ్ కిచ్లు, కొడుకు నీల్ తో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టింది. కాజల్ ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంది. మా పవిత్రమైన కుటుంబం కోసం ఈ వారంలోనే కొత్తింటి గృహ ప్రవేశం, పూజ జరిగింది. ఇది మేము ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇల్లు, ఇది నేను ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. 

ఈ శుభసందర్భంలో మా హృదయాలు ఆనందంగా, కృతజ్ఞతతో కూడుకుని ఉన్నాయి అంటూ ఆ కొత్తింటి గృహ ప్రవేశం చేస్తూ చేసిన పూజకి సంబందించిన ఫొటోస్ ని కాజల్ అగర్వాల్ షేర్ చేసింది. ప్రస్తుతం కాజల్ ఆమె భర్త గౌతమ్, కొడుకు నీల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Kajal Aggarwal new house Pics :

Kajal Aggarwal new house Pics going viral

Tags:   KAJAL AGGARWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ