Advertisementt

బాలకృష్ణుడు కాదు ఫిట్టింగ్ కృష్ణుడు

Fri 13th Oct 2023 10:10 PM
balakrishna  బాలకృష్ణుడు కాదు ఫిట్టింగ్ కృష్ణుడు
Balakrishna Unstoppable 3 promo out బాలకృష్ణుడు కాదు ఫిట్టింగ్ కృష్ణుడు
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వారు అన్ స్టాపబుల్ సీజన్ 3 రెడీ చేసేసింది. దసరా స్పెషల్ ఈనెల 17 న లిమిటెడ్ ఎడిషన్ తో మొదటి ఎపిసోడ్ ప్రసారమవుతుంది. అన్ స్టాపబుల్ అంటూ బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి టీమ్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల, విలన్ పాత్రధారి అర్జున్ రాంపాల్ లు ఈ ఎపిసోడ్ లో సందడి చేసారు.

బాలకృష్ణ లుక్స్ ఎప్పటిలాగే మెస్మరైజ్ చెయ్యగా.. అనిల్ రావిపూడి తో మాట మంతి, హీరోయిన్స్ తో ఆటలు అబ్బో బాలయ్య ఆహా టాలెంట్ చూపించేసారు. అనిల్ రావిపూడి బాబు మీతో నేను ఫుల్ ఫ్లెజ్జుడుగా ఎంటర్టైనర్ చెయ్యాలి అని అడగ్గానే.. నా సెటైర్స్ తో నిన్ను రిటైర్ చేస్తా అన్నారు. 

ఇక కాజల్ ని నందమూరి హీరోలతో చేసావ్, కొణిదెల హీరోలందరితో చేసావ్.. మోక్షుతో చేస్తావా అనగానే 100 పర్సెంట్ అంది కాజల్. ఇక శ్రీలీల ని డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు ఏమంటున్నారో తెలుసా.. అయితే బాలకృష్ణతో సినిమా చెయ్యాలి, లేదా శ్రీలీలతో సినిమా చేయాలంటున్నారంటూ ఫన్నీగా మాట్లాడారు.. ఇక అనిల్ రావిపూడి తో సీరియస్ గా నీకు తమన్నాతో ఎందుకు గొడవయ్యింది అనగానే అనిల్ రావిపూడి కూడా మీరు బాలకృష్ణుడు కాదు బాబు ఫిట్టింగ్ కృష్ణుడు అన్నాడు.

ఇక విలన్ అర్జున్ రామ్ పాల తో డాన్స్, శ్రీలీల ని నీతో ఇండస్ట్రీలో ఫ్లట్ చేసిన హీరో ఎవరు అంటూ సరదాగా ఆటాడించిన అన్ స్టాపబుల్ 3 ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. 

Balakrishna Unstoppable 3 promo out:

Unstoppable Ep 1 Promo out

Tags:   BALAKRISHNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ