Advertisementt

బిగ్ బాస్ 7.. షాకింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

Sat 30th Sep 2023 08:29 AM
wild card entry,bigg boss 7,nagarjuna,7 members  బిగ్ బాస్ 7.. షాకింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
Bigg Boss 7 Shocking Wild Card Entry బిగ్ బాస్ 7.. షాకింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఈసారి చాలాతక్కువమంది ఎంట్రీ ఇచ్చారు. కేవలం 14 మంది కంటెస్టెంట్స్‌నే యాజమాన్యం హౌస్‌లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి కాగా.. ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో పది మంది మాత్రమే హౌస్‌లో కనిపిస్తున్నారు. టాస్క్‌లలో కూడా ఈ పదిమందే పోటీ పడుతున్నారు. అందులో ముగ్గురు ఇప్పటికే సేఫ్ అయ్యి గేమ్ మానేసి సంచాలక్ లుగా వ్యవహరిస్తున్నారు. హౌస్‌లో అక్కడక్కడా పల్చగా కంటెస్టెంట్స్ కనిపిస్తున్నారు. 

అందుకే బిగ్ బాస్ యాజమాన్యం కొంతమందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించాలనుకుంటుందట. ఒకరిద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే  ప్రచారం జరిగినా అప్పుడే మూడు వారాలు పూర్తయ్యి నాలుగో వారం కూడా వచ్చేసింది., ఇక వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉండవేమో అన్నారు. కానీ ఈ నెల 30 న బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా 7 గురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం మొదలైంది. 

ముందు నుంచి వినిపించిన పేర్లే.. ఐదో వారం స్టార్టింగ్‌లో హౌస్ లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారట. వారే అంజలి-పవన్, సీరియల్ ఆర్టిస్ట్ అంబటి అర్జున్, భోలే షవాలి, యాంకర్ ప్రత్యూష, యాక్టర్ ఫర్జానా, సుప్రిత అంటూ కొన్ని పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతమంది హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశిస్తారో అనేది మరో ఐదు రోజులాగితే తెలిసిపోతుంది.

Bigg Boss 7 Shocking Wild Card Entry:

7 Members Wild Card Entry to Bigg Boss 7

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ