Advertisementt

బిగ్ బాస్ 7 లో మొదలైన లవ్ స్టోరీ

Sat 16th Sep 2023 01:58 PM
bigg boss telugu 7  బిగ్ బాస్ 7 లో మొదలైన లవ్ స్టోరీ
Bigg Boss 7: Love Story Start బిగ్ బాస్ 7 లో మొదలైన లవ్ స్టోరీ
Advertisement
Ads by CJ

ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఇద్దరి మద్యన ప్రేమ ఉన్నట్టుగా బిగ్ బాస్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు. మొదటి సీజన్ నుంచి నిన్నమొన్నటి సీజన్ 6 వరకు ఇలాంటి జంట పక్షులను చాలానే చూపించారు. రాహుల్-పునర్నవి, షణ్ముఖ్ అలాగే సిరి మద్యన ఫ్రెండ్ షిప్ కాస్తా ప్రేమికులు అనేలా వారు బిహేవ్ చెయ్యడం, గత సీజన్ లో సూర్య-ఇనాయ లవ్ స్టోరీ ఇలా చాలానే జరిగాయి. అది బుల్లితెర ప్రేక్షకులు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. 

అందుకే ఈ సీజన్ లోను అలాంటి లవ్ బర్డ్స్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ సీజన్ లో రతిక-ప్రిన్స్ మధ్యన లవ్ ఉంది అనేలా వారిద్దరిని ఎక్కువగా హైలెట్ చేస్తున్నాడు. హార్ట్ సింబల్స్, ఐ లైక్ యు, ఐ లికె యు టూ అనడం, పల్లవి ప్రశాంత్ పిన్స్ ని రతిక మీద ఏమైనా ఫీలింగ్ ఉందా అంటే.. ప్రిన్స్ కూడా కొంచెం కొంచెం ఫీలింగ్స్ వస్తున్నాయని అనడం అబ్బో ఈ సీజన్ లో రెండో వారంలో పిన్స్-రతిక కంటెంట్ కోసం చాలానే మొదలు పెట్టారనిపించేలా ఉంది వ్యవహారం. 

మరి పిన్స్-రతిక ఎప్పటివరకు ఎలిమినేట్ అవ్వకుండా ఉంటారో అప్పటివరకు వీరి మధ్యన ఏదో ఉంది అనేలా బిగ్ బాస్ చూపించడానికి తంటాలు పడకతప్పదు. ఇక రతిక, ప్రిన్స్ ఇద్దరూ హౌస్ లో మిగతా వారితో చాలా అతి చేస్తున్నారు. రతిక అయితే మిగతా హౌస్ మేట్స్ ని రెచ్చగొడుతుంది. ప్రిన్స్ కూడా  గౌతమ్ పై ఊరికే రెచ్చిపోయి గోల చేస్తూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

Bigg Boss 7: Love Story Start:

Bigg Boss Telugu 7: Love stories that started in the house.. ?

Tags:   BIGG BOSS TELUGU 7
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ