Advertisementt

ఇంట్రెస్టింగ్: ప్రభాస్-మారుతి మూవీ అప్డేట్

Sat 16th Sep 2023 10:53 AM
prabhas  ఇంట్రెస్టింగ్: ప్రభాస్-మారుతి మూవీ అప్డేట్
Interesting: Prabhas-Maruthi movie update ఇంట్రెస్టింగ్: ప్రభాస్-మారుతి మూవీ అప్డేట్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిన్న దర్శకుడు మారుతితో చేస్తున్న సినిమా షూటింగ్ సైలెంట్ గా జరిగినా.. మారుతి కొంతమంది ద్వారా సినిమా షూటింగ్ అప్ డేట్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తూ ప్రభాస్ ఫాన్స్ ని ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ విదేశాలకి వెళ్ళాడు. అక్కడ ఆయన మోకాలి సర్జరీ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో హీరోకి సంబంధం లేని కొన్ని సీన్స్ ని మారుతి తెరకెక్కిస్తున్నాడు. అందులో హీరోయిన్ మాళవిక మోహన్ కూరగాయల మార్కెట్ లో ఫైట్ చేస్తున్న సీన్ ఒకటి లీకైంది. ఆ వీడియోని ప్రభాస్ ఫాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. 

ఆ సీన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడు తాజాగా ప్రభాస్-మారుతి మూవీ షూటింగ్ 40 శాతం పూర్తయ్యింది అని ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో కనిపించింది. అంటే ప్రభాస్-మారుతీ మూవీ వచ్చే ఏడాది చివరిలోనో లేదంటే 2025 ప్రధమార్ధంలోనో విడుదలయ్యే చాన్సు ఉంది అంటూ అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. 

Interesting: Prabhas-Maruthi movie update:

Interesting update on Prabhas and Maruthi Film

Tags:   PRABHAS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ