Advertisement

దేవరా..?.. ఎవరి మీద కోపంతో ఇలా..!?

Fri 15th Sep 2023 09:24 PM
atchannaidu  దేవరా..?.. ఎవరి మీద కోపంతో ఇలా..!?
Devara..?.. angry with whom..!? దేవరా..?.. ఎవరి మీద కోపంతో ఇలా..!?
Advertisement

ఊహించని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ అరెస్ట్‌‌పై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అమెరికా నుంచి అలాస్కా వరకూ అందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రోడ్డెక్కి అక్రమ అరెస్ట్ అంటూ ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, అగ్రనేతలంతా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. అంతేకాదు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ నటులు కూడా బాబు అరెస్ట్‌ను ఖండిస్తూనే సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నారు. కానీ టాలీవుడ్ నటులు మాత్రం కిక్కిరిమనడం లేదు? ఒకరిద్దరు తప్పా పెద్దగా స్పందించినోళ్లు కనిపించలేదు. పవన్‌కల్యాణ్ మాత్రం నటుడిగానే కాకుండా ఓ పార్టీ అధినేతగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ ద్వారా కలిసి మద్దతు తెలిపారు. అంతేకాకుండా 2024లో జరిగే ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకున్నారు. ఇదంతా ఒకే. ఎవరెన్నీ ప్రకటనలు చేసినా.. మాట్లాడినా చంద్రబాబు ఫ్యామిలీకి కొండంత ధైర్యమే. 

కానీ ఇదంతా ఒకెత్తు అయితే.. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్ట్‌పై ఇంత మంది స్పందించినా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదన్నదే ఇప్పుడు అసలు సిసలైన బర్నింగ్ టాఫిక్‌గా మారింది. ఎంత శతృత్వం ఉన్నా.. కష్టాల్లో ఉన్నప్పుడు సహజంగా పలకరించడం అనేది మానవత్వం. అలాంటిది చంద్రబాబు జైలుకు వెళ్లడం.. కుటుంబ సభ్యులు నిద్రహారాలు మాని 24 గంటలు చంద్రబాబుపైనే దృష్టి పెట్టారు. జైల్లో ఏం జరుగుతుంది? ఎలా ఉంటున్నారన్న ఆలోచనలతోనే గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మాట వరసకైనా జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి పలకరించకపోవడంతో కుటుంబ సభ్యుల్ని కలిచివేస్తోంది. ఆ పార్టీ నేతలను కూడా నిర్ఘంతపోయేలా చేసింది. 

అదేదో విదేశాల్లో ఉన్నారులే.. పోనీలే.. అనుకుంటాకి లేదు. నిన్నటి దాకా హైదరాబాద్‌లోనే ఉంటూ ‘దేవర’ సినిమా షూటింగుల్లో పాల్గొన్నారు. ఇక్కడే ఉండి కనీసం ఫోన్ చేసి చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని పలకరించలేకపోయారు. పైగా ఉన్నట్టుండి గురువారం కుటుంబ సభ్యులతో దుబాయ్‌కి వెళ్లిపోయారు. ఈ జర్నీ ముందుగానే డిసైడైందో.. లేదంటే ఈ గొడవంతా నాకెందుకులే అనుకొని విదేశాలకు వెళ్లిపోయారో తెలియదు కానీ అందరికీ మాత్రం కార్నర్ అయ్యారు. కష్ట సమయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎందుకు చేస్తున్నారని మాత్రం వెళ్లన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి. 

అంతేకాదు ఇటీవల పెద్ద ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనలేదు. అప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ముర్ము సమక్షంలో వంద రూపాయిల నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు. తాత పేరు పెట్టుకుని ఈ ప్రోగ్రామ్‌కి ఎందుకు హాజరుకాలేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడిచాయి. అంతకముందు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా ఆహ్వానం అందింది. దీనికి కూడా హాజరుకాలేదు. ఇంత ముఖ్యమైన కార్యక్రమాల్లో జూ.ఎన్టీఆర్ ఎందుకు పాల్గోలేదంటూ నందమూరి అభిమానులు ప్రశ్నించారు. తాజాగా చంద్రబాబు కుటుంబంలో ఇంత క్టిష్ల పరిస్థితులు ఏర్పడితే కనీసం ఫోన్ చేసి పలకరించలేనంతా సమయం లేదా? పైగా ఈ టైమ్‌లో దుబాయ్‌కి వెళ్లిపోవడమేంటి? అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. 

తాజాగా ఇదే వ్యవహారంపై ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ... జూనియర్ ఎన్టీఆర్ (jr.ntr) ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగండి అని చెప్పారు. అయినా ఎవరినీ స్పందించమని మేము అడగబోమని తేల్చి చెప్పారు.

Devara..?.. angry with whom..!?:

Atchannaidu Comments on Jr. NTR Silence

Tags:   ATCHANNAIDU
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement