Advertisementt

సలార్ డేట్ కి స్కంద - చంద్రముఖి సై

Fri 08th Sep 2023 03:40 PM
chandramukhi 2  సలార్ డేట్ కి స్కంద - చంద్రముఖి సై
Chandramukhi 2 postpone? సలార్ డేట్ కి స్కంద - చంద్రముఖి సై
Advertisement
Ads by CJ

పలు సినిమా ఇండస్ట్రీల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. సలార్ ప్యాన్ ఇండియా ఫిలిం వాయిదా పడడంతో కొన్ని సినిమాలు తమ సొంత డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకోవడం, కొన్ని ప్రీపోన్  చేసుకుంటూ సలార్ డేట్ ని ఆక్యుపై చేస్తున్నాయి. స్కంద, రూల్స్ రంజన్ ఇవన్నీ సలార్ డేట్ సెప్టెంబర్ 28 కి వస్తున్నట్టుగా అఫీషియల్ ప్రకటించాయి. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 15 న రావాల్సిన రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 విడుదల వాయిదా అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

సిజి వర్క్ కంప్లీట్ కాలేదు అని సిల్లీ రీజన్స్ వినిపిస్తున్నాయి కానీ.. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ఇంకా చంద్రముఖి 2 టీం అంతా కలిసి ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. చెన్నై వేదికగా పెద్ద ఈవెంట్, పలు ఇంటర్వూస్, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసాక సినిమా వాయిదా అంటే ఎవ్వరు నమ్ముతారు. అందులోను సీజీ వర్క్ వలన ఇప్పుడు పోస్ట్ పోన్ అంటున్నారు. 

అది సిల్లీ రీజన్ కాదు నిజమే.. సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతోనే చంద్రముఖి2 ని సలార్ డేట్ అంటే 28 సెప్టెంబర్ కి విడుదల చేస్తునంట్టుగా తెలుస్తోంది. సలార్ ఈ నెల 28 నుంచి తప్పుకోవడంతో చంద్రముఖి 2, స్కంద రెండు సినిమాలు సెప్టెంబర్ 28 న రావడానికి సై అంటున్నాయి. 

Chandramukhi 2 postpone?:

Chandramukhi 2 release date postponed?

Tags:   CHANDRAMUKHI 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ