Advertisementt

పాలిటిక్స్‌పై విశాల్ మరోసారి క్లారిటీ

Mon 04th Sep 2023 08:17 AM
vishal,politics,mark antony,kollywood  పాలిటిక్స్‌పై విశాల్ మరోసారి క్లారిటీ
Vishal Clarity about Polical Entry పాలిటిక్స్‌పై విశాల్ మరోసారి క్లారిటీ
Advertisement
Ads by CJ

తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని మరోసారి స్పష్టం చేశారు హీరో విశాల్. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోని’ సెప్టెంబర్ 15న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో విశాల్ బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షో వీక్షించిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను రాబట్టుకోవడంతో.. సినిమాపై విశాల్ అండ్ టీమ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విశాల్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విశాల్.. తను రాజకీయాలలోకి వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇస్తూ వస్తున్నారు.

ఈ సందర్భంగా విశాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే లేదన్నారు. రాజకీయాలలోకి రాకుండా కూడా ప్రజా సేవ చేయవచ్చని చెప్పుకొచ్చారు. తూత్తుకుడి జిల్లా విళాత్తికుళంలోని ఒక గ్రామంలో తాగునీటి బోరును వేయించానన్నారు. దీని వల్ల 250 కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇది తను పాలిటిక్స్‌లో ఉండి చేసిన పని కాదని అన్నారు. సేవ చేయాలనే సంకల్పం ఉంటే.. అదే మనల్ని ముందుకు తీసుకెళుతుందని విశాల్ వెల్లడించారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవని విశాల్ అన్నారు. 2006లో ఒకసారి ఎయిర్‌పోర్టులో కూర్చొని ఉన్న సమయంలో నడిగర్‌ సంఘం సభ్యుడు కావాలన్న ఆశ ఏర్పడిందా? అంటూ నటుడు రాధారవి ప్రశ్నించారని... చివరకు ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. తాను గెలుపొందడంతో, రాధారవి ఆయన స్థానంలో కూర్చోబెట్టారని తెలిపారు. అందువల్ల భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. ఫైనల్‌గా.. పేరు ప్రఖ్యాతలు వస్తాయనో, ఇంకా ఏదో ఆశించి నేనేం సేవ చేయడం లేదని విశాల్ క్లారిటీ ఇచ్చారు.

Vishal Clarity about Polical Entry:

Again Vishal About Politics

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ