Advertisement

వైఎస్ జగన్‌కు తలనొప్పిగా విజయసాయి

Tue 29th Aug 2023 07:18 PM
vijay sai reddy  వైఎస్ జగన్‌కు తలనొప్పిగా విజయసాయి
Vijay Sai Reddy gets a new headache from YS Jagan వైఎస్ జగన్‌కు తలనొప్పిగా విజయసాయి
Advertisement

ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి తిరిగి దగ్గరయ్యారు. ఆ మధ్యకాలంలో వాళ్లిద్దరికీ మధ్య దూరం బాగా పెరిగింది. అంతెందుకు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా విజయసాయిరెడ్డి ఢిల్లీకి వెళ్లి కూర్చొన్నారు. అలాంటిది ఇప్పుడు సీఎం జగన్, విజయసాయిరెడ్డిల మధ్య సఖ్యత పెరిగింది. ఈలోపే మరోసారి విజయసాయిరెడ్డి కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. అసలే విజయసాయి రెడ్డి కారణంగా తలెత్తిన సమస్యలు ఇటీవలి కాలంలో కాస్త తగ్గాయని రిలాక్స్ అవుతున్న జగన్‌కు మరోసారి తలనొప్పులు స్టార్ట్ అయ్యాయట. విజయసాయిరెడ్డిని గట్టిగా ఏం అనలేక.. అలాగని అనకుండా ఉండలేక జగన్ సతమతమవుతున్నారట. అసలే విశాఖను రాజధానిని చేసి చక్రం తిప్పాలని జగన్ అనుకుంటుంటే.. పార్టీని డ్యామేజ్ చేసేలా విజయసాయి వ్యవహరించడం జగన్‌కు నిద్ర లేకుండా చేస్తోందట.

వైసీపీకి విజయసాయిరెడ్డి కావల్సినంత డ్యామేజ్ అయితే చేశారు. ఆయనపై బీభత్సమైన ఆరోపణలు.. సొంత పార్టీ నేతల నుంచే జగన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తడం.. వంటివి జరిగాయి. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి అండ చూసుకుని భూకబ్జాలకు తెరదీశారు. ఇప్పుడే ఇన్ని భూకబ్జాలైతే.. విశాఖ రాజధాని అయితే పరిస్థితి ఏంటన్న భయం అక్కడి జనాల్లో లేకపోలేదు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డికి జగన్ చెప్పి చూసినా ఫలితం లేకపోవడంతో ఆయన నుంచి విశాఖలో అధికారాలన్నీ లాగేశారు. దీంతో అలిగిన విజయసాయిరెడ్డి కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సహకరించలేదు. మొత్తానికి అసలే ఎన్నికల సమయం కావడంతోనో మరో కారణమో కానీ చివరకు జగన్ దిగివచ్చారు. విజయసాయికి వేరే బాధ్యతలు అప్పగించి ఆయనను కూల్ చేశారు.

మళ్లీ విజయసాయిరెడ్డి వ్యవహారశైలిలో మార్పు వచ్చింది. తాజాగా తన కూతురి కోసం ఏకంగా తుర్లవాడ కొండను కబ్జా చేసేందుకు యత్నించారని అక్కడ ప్రచారం జరుగుతోంది. సుమారు 200 ఎకరలను కూతురికి రాసివ్వాలని విజయసాయి రెడ్డి యత్నిస్తున్నారట. భూమిని కబ్జా చేసి దానిలో కూతురి పేరిట యూనివర్సిటీ కట్టే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల విజయసాయిరెడ్డి తన మనుషులతో కలిసి తుర్లవాడ కొండకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అసలే కొండపై దేవుడి పాదాలున్నాయని ప్రజల నమ్మకం. అలాంటి కొండను విజయసాయిరెడ్డి కబ్జా చేయబోతున్నారన్న ప్రచారం విశాఖలో జోరందుకుంది. ఈ ప్రచారం చివరకు సీఎం జగన్‌కు కూడా చేరింది. దీంతో ఏం చేయాలో తెలియక జగన్ తలపట్టుకున్నారట. మరి ఈ విషయంపై జగన్ ఏం చేస్తారో చూడాలి.

Vijay Sai Reddy gets a new headache from YS Jagan:

Vijay Sai Reddy gets a new headache from the YCP party

Tags:   VIJAY SAI REDDY
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement