ఈరోజు ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలివే!

Sat 02nd Sep 2023 11:43 AM
bro,baby,slumdog husband,ott,streaming  ఈరోజు ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలివే!
Today OTT Release Movies Details ఈరోజు ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలివే!
Advertisement
Ads by CJ

ప్రతి శుక్రవారం లాగే ఈ శుక్రవారం కూడా థియేటర్స్‌లోనే కాదు.. ఓటీటీలలోనూ బోలెడన్ని సినిమాలు, వెబ్ సీరీస్‌లు ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చేశాయి. నిన్న గురువారం దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త డబ్బింగ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాగా.. అది సో సో టాక్ తెచ్చుకుంది. ఇక ఈరోజు ఫ్రైడే.. వరుణ్ తేజ్ గాండీవధార అర్జున-కార్తికేయ బెదురులంక 2012 చిత్రాలతో పాటుగా ఒకటి రెండు చిన్న సినిమాలు థియేటర్స్‌లో విడుదలయ్యాయి. వరుణ్ తేజ్, కార్తికేయ వంటి హీరోల చిత్రాలతో ఈ వారం కాస్త థియేటర్ల వద్ద సందడి నెలకొనే అవకాశమే కనిపిస్తున్నా.. అందరి కళ్లు ఈ వారం ఓటీటీలపైనే ఉన్నాయని చెప్పుకోవాలి. 

ఎందుకంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’, రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బేబీ’ సినిమాలు ఈ వారం ఓటీటీలలో సందడి చేయనున్నాయి. అందుకే అందరూ ఈ వారం ఎక్కువగా ఓటీటీలపైనే శ్రద్ద పెట్టే అవకాశం ఉంది. 

ఓటీటీలోకి ఆగస్ట్ 25‌న స్ట్రీమింగ్‌కి వచ్చిన చిత్ర వివరాల్లోకి వెళిలే..

*నెట్‌ఫ్లిక్స్ నుండి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ నటించిన ‘బ్రో’ గత అర్థరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

*ఆహా ఓటిటీ నుండి థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘బేబీ’ గత రాత్రి నుండి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది

*బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌ రావు నటించిన ‘స్లమ్‌డాగ్‌ హస్బండ్‌’ అమెజాన్ ప్రైమ్ నుండి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. 

వీటితో పాటుగా ఇంకొన్ని వెబ్ సీరీస్‌లు కూడా పలు ఓటీటీల నుండి అందుబాటులోకి వచ్చాయి.

Today OTT Release Movies Details:

Bro, Baby and Slumdog Husband Streaming in OTT

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ