యాంకర్ వర్షిణి కొన్నాళ్ల క్రితం వరకు బుల్లితెర పై తెగ సందడి చేసేది,. కానీ ఇప్పుడు బుల్లితెరపై చాలా అరుదుగా కనబడుతుంది. దానితో ఆమె బిగ్ బాస్ కి వెళ్లబోతుంది, కాదు ఆమె పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. మరికొంతమంది వర్షిణి హీరోయిన్ అవ్వాలని కలలు కంటుంది అందుకే ఆమె ఆ వేలోనే ప్రయత్నాలు చేస్తుంది అంటూ చెప్పుకుంటున్నారు. తాజాగా వర్షిణి తనకి గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా లో షేర్ చేసింది.
తనకి లాక్ డౌన్ ముందు వెబ్ సీరీస్ అవకాశం వచ్చింది. ఆడిషన్స్ కోసం హోటల్ కు రావాలని ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్రమ్మన్నాడు. అక్కడ ఆడిషన్ అయిపోయిన తర్వాత నువ్వు సూపర్, వెబ్ సిరీస్ కు నువ్వు బాగా సూట్ అవుతావని ఆ డైరెక్టర్ చెప్పాడు. దానితో నాకు అవకాశం వచ్చినట్టేనని అనుకున్నాను.
ఆ తర్వాత ఆ డైరెక్టర్ తనతో పాటు గదిలోకి రావాలని పిలిచాడని, అంతేకాకుండా బెడ్ పైకి లాగే ప్రయత్నం చేశాడని, డ్రెస్ విప్పమని ఫోర్స్ చేశాడని.. అప్పుడు తానెంతో భయపడిపోయానని, ఆ క్షణంలో ఏం చెయ్యాలో తెలియలేదు. అతన్ని విడిపించుకుని బయటకు వచ్చేశానని, ఆ తర్వాత చాలా సేపు ఏడ్చానని చెప్పిన వర్షిణి ఆ సంఘటన తన జీవితంలో భయానక అనుభవమని చెప్పుకొచ్చింది.