Advertisementt

ఫైనల్లీ హిట్ కొట్టేసిన సూపర్ స్టార్

Thu 10th Aug 2023 11:25 AM
jailer movie  ఫైనల్లీ హిట్ కొట్టేసిన సూపర్ స్టార్
Jailer public talk ఫైనల్లీ హిట్ కొట్టేసిన సూపర్ స్టార్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టి కొన్నేళ్లయ్యింది. వరసగా సినిమాలు చేస్తున్నా ఆయన్ని డిజాస్టర్స్ పలకరిస్తున్నాయి కానీ.. సక్సెస్ మాత్రం రావడం లేదు. అయినా సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే ఆ క్రేజే వేరే.. ఆ ఆసక్తే వేరు. ఇక కో కో కోకిల, వరుణ్ డాక్టర్ లాంటి కామెడీ ఎంటెర్టైనెర్స్ తో కామెడీ డైరెక్టర్ గా ఫేమస్ అయిన నెల్సన్ దిలీప్ కుమార్.. సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేస్తున్నాడంటే.. ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అనే ఆత్రుత అందరిలో స్టార్ట్ అయ్యింది. ఈ మధ్యలో నెల్సన్ స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ తెరకెక్కించి విఫలమయ్యాడు. దానితో కొందరిలో భయం మొదలైంది. రజినీకాంత్ కి మరో ప్లాప్ అంటగడతాడని ఆందోళ పడ్డారు. 

మరి ఇన్ని రకాల కంఫ్యూజన్స్ మధ్యన రజినీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. జైలర్ సినిమా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ సినిమా ఎలా ఉందో అనేది సోషల్ మీడియాలో ట్వీట్ల రూపంలో చెప్పేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అలా.. సెకండ్ ఇలా.. సూపర్ స్టార్ అయితే అదిరిపోయాడు.. అంటూ ట్వీట్లు వేస్తున్నారు. జైలర్ ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది, నెల్సన్ మార్క్ కామెడీ, రజనీ చేసిన అద్భుతమైన స్టైలిష్ యాక్షన్.. బిగ్ టైమ్ వర్క్ అవుట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్ గూస్‌బంప్స్. మాస్ మసాలా ఎంటర్‌టైనర్.. అయితే జైలర్ ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అన్నప్పటికీ.. సెకండ్ హాఫ్ ఆ ఎంగేజ్ ని అందుకోవడంలో తడబడింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ.. సెకండ్ హాఫ్ లో తగ్గింది.. అయినప్పటికీ జైలర్ బావుంది అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

మరి ఇంత పాజిటివ్ రిపోర్ట్స్ తెలుగులోనే కనిపిస్తున్నాయి అంటే.. తమిళనాట జైలర్ కి సూపర్ హిట్ టాక్ పడిపోయినట్లే. ఎన్నో ఏళ్ళు, మరెన్నో ప్లాప్ ల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తో సూపర్ హిట్ అందుకున్నట్టే అంటూ రజిని అభిమానులు జైలర్ విడుదలైన థియేటర్స్ ముందు కేరింతలు కొడుతూ టపాసులు కాలుస్తున్నారు. 

Jailer public talk:

Jailer Movie Telugu Public Talk

Tags:   JAILER MOVIE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ