Advertisement

అంబటికి ‘బ్రో’ నిర్మాత దిమ్మతిరిగే ఆన్సర్

Fri 04th Aug 2023 11:56 AM
bro,ambati rambabu,tg viswa prasad,controversy,counter  అంబటికి ‘బ్రో’ నిర్మాత దిమ్మతిరిగే ఆన్సర్
Bro Producer Counter Attack On Ambati Rambabu అంబటికి ‘బ్రో’ నిర్మాత దిమ్మతిరిగే ఆన్సర్
Advertisement

ఏపీ మంత్రి అంబటి రాంబాబు పదే పదే BRO మూవీపై, దర్శకనిర్మాతలు, రచయిత త్రివిక్రమ్‌పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తనని కించపరిచేలా ఓ కేరెక్టర్‌ని BROలో చూపించారంటూ నానా గోల చేస్తున్నారు. అసలు అంబటి ఎందుకు అలా ఉలిక్కిపడి BRO మూవీపై కామెంట్స్ చేస్తూ ప్రెస్ మీట్స్ పెట్టడం, ట్వీట్స్ వేయడం అంటూ చూసిన వారు నవ్వుకుంటున్నారు. మరోపక్క BRO నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పై అంబటి చేసిన వ్యాఖ్యలకి విశ్వప్రసాద్ కూడా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

బ్రో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఓ NRI. అమెరికా నుంచి పవన్‌కు వస్తున్న డబ్బు పెద్ద స్కాం. పొత్తులో భాగంగా పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు నాయుడు ముఠా ఇలా తన మనిషి విశ్వప్రసాద్‌ ద్వారా అందిస్తున్నాడు అంటూ ప్రెస్ మీట్ లో BRO నిర్మాతపై దారుణమైన కామెంట్స్ చేశారు. దానికి విశ్వ ప్రసాద్ కూడా తన స్టయిల్లో సమాధానం చెప్పారు. BRO చిత్రానికి అంబటి రాంబాబుకి సంబంధం ఏమిటి? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. BRO చిత్రంలో శ్యాంబాబు పాత్రకి అంబటికి పోలికేమిటి.. ఆయన రాజకీయ నాయకుడు. మా సినిమాలో శ్యాంబాబు ది బాధ్యతలేని కేరెక్టర్. వీరికి అసలు పోలికే లేదు. 

శ్యాంబాబు వేసిన డాన్స్‌కి, అంబటి రాంబాబు వేసిన డాన్స్‌కి పోలిక లేదు, కేరెక్టర్ సింక్ అవలేదు. ఏదో టి షార్ట్ ఒకేలా ఉంది అని గోల చేస్తే ఎలా.. గతంలో పొలిటిషన్స్‌ని టార్గెట్ చేస్తూ సినిమాలు తెరకెక్కాయి. ఎవరూ ఇలా టార్గెట్ చెయ్యలేదు. అంబటి రాంబాబు BRO చిత్రాన్ని బాగా టార్గెట్ చేశారు.. చేయనివ్వండి.. అది మాకే పబ్లిసిటీ అవుతుంది. త‌ద్వారా త‌మ‌కు క‌లెక్ష‌న్లు కూడా పెరిగాయ‌ని అంబటికి.. విశ్వప్రసాద్  దిమ్మతిరిగిపోయేలా కౌంటర్ వేశారు.

Bro Producer Counter Attack On Ambati Rambabu:

Bro Producer about Ambati Rambabu Controversy

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement