లైగర్ ప్లాప్ తర్వాత ఆ సినిమా కొని లాస్ అయిన బయ్యర్ల విషయంలో అలాగే లైగర్ పెట్టుబడుల విషయంలో సతమతమైన పూరి జగన్నాథ్ కొద్దిగా బ్రేక్ తీసుకుని తన తదుపరి ప్రాజెక్ట్ స్క్రిప్ట్ విషయంలో నిమగ్నమయ్యాడు. ఇన్నాళ్లుగా కామ్ గా కనిపిస్తున్న పూరి జగన్నాథ్ ఛార్మితో కలిసి ముంబై వెళ్లి మరీ కథా రాసుకుని తనకి ఇస్మార్త్ శంకర్ తో ఆఫర్ ఇచ్చి మళ్ళీ దర్శకుడిగా, నిర్మాతగా నిలబెట్టిన రామ్ తో డబుల్ ఇస్మార్ట్ ఓకె చేయించుకుని అనౌన్సమెంట్ ఇచ్చేసారు.
పూరి జగన్నాథ్ షూటింగ్ స్టార్ట్ చేస్తే చాలా స్పీడుగా ఆ సినిమా పూర్తవుతుంది. మ్యాగ్జిమమ్ ఆరు నెలల్లో షూట్ కంప్లీట్ చేస్తాడు. లైగర్ కూడా కరోనా వలన లేట్ అయ్యింది కానీ లేదంటే విషయం మాములుగా ఉండేది కాదు. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ని ఇలా లాంచ్ చేసి అలా ముంబైలో యాక్షన్ పార్ట్ తో మొదటి షెడ్యూల్ మొదలు పెట్టిన పూరి జగన్నాథ్ దానిని చక చకా పూర్తి చేసి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చేసారు. ఈ చిత్రం కోసం హీరో రామ్ తన లుక్ ని చాలా ఫాస్ట్ గా ఛేంజ్ చేసేసాడు.
తాజాగా ఛార్మి, రామ్ తో ఉన్న పిక్ ని వదులుతూ Team #DoubleISMART successfully completed the action-packed First Schedule in Mumbai and the next crazy schedule will be shot out of India 🔥 ముంబై లో యాక్షన్ ప్యాకెడ్ షెడ్యూల్ పూర్తయ్యింది.. నెక్స్ట్ క్రేజీ షెడ్యూల్ అవుట్ అఫ్ ఇండియాలో అంటూ ఆసక్తిని రేకెత్తించారు.
ఇక ఈ ప్యాన్ ఇండియా డబుల్ ఇస్మార్ట్ ని కూడా పూరి జగన్నాథ్ ఎనిమిది నెలల్లో పూర్తి చేసి మార్చి 8 న శివరాత్రికి రిలీజ్ చేస్తున్నామంటూ డేట్ కూడా లాక్ చేసేసారు. జులై చివరిలో మొదలైన డబుల్ ఇస్మార్ట్ డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకుని మరో రెండు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ లో నిమగ్నమై మార్చి 8 న ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందు వచేస్తుందన్నమాట. మరి కొన్నాళ్లుగా కామ్ గా కనిపించిన పూరి ఇప్పుడు మళ్ళీ తన కొత్త ప్రాజెక్ట్ తో స్పీడందుకున్నారు.