Advertisement

బేబీ హీరోయిన్ కొత్త ప్రాజెక్ట్ సెట్

Sun 23rd Jul 2023 04:42 PM
vaishnavi chaitanya  బేబీ హీరోయిన్ కొత్త ప్రాజెక్ట్ సెట్
Baby Heroine is a new project set బేబీ హీరోయిన్ కొత్త ప్రాజెక్ట్ సెట్
Advertisement

గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి సోలో నిర్మాతగా SKN బేబీ అనే చిన్న మూవీని తెరకెక్కించి కోట్లు కొల్లగొడుతున్నాడు. బేబీ మూవీకి గీత ఆర్ట్స్ నుండి బలమైన సపోర్ట్ దొరడమే కాదు.. అల్లు అర్జున్ ఏకంగా బేబీ మూవీపై అందులోని హీరోయిన్ వైష్ణవి చైతన్య పై బలమైన మాటలు చెప్పడంతో బేబీ కలెక్షన్స్ రెండో వారంలోను దంచికొడుతున్నాయి. బేబీ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న బస్తీ అమ్మాయిగా వైష్ణవి చైతన్య పెరఫార్మెన్స్ అందరిని ఆకట్టుకుంది. అల్లు అర్జున్ తెలుగమ్మాయిలు సినిమాల్లోకి రావాలంటూ వెల్ కమ్ కూడా చెప్పారు. అయితే బేబీ సినిమాలో నటించిన వైష్ణవి గతంలో ఇన్స్టా రీల్స్, షణ్ముఖ్ తో డాన్స్ స్టెప్స్ అలాగే వెబ్ సీరీస్ లతో ఫేమస్ అయ్యి ట్రెడిషనల్ కి కేరాఫ్ గానే కనిపించింది.

అయితే బేబీ మూవీతో ఆమె లోని నటన మొత్తం బయటికి వచ్చింది. తాజాగా వైష్ణవి చైతన్య రెండో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అయ్యింది అంటున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ఆమె రెండో ప్రాజెక్ట్ ఉండబోతుంది అని, అది కూడా ఫీమేల్ ఓరియెంటెడ్ గానే ఉండబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మరోపక్క అల్లు అర్జున్ సపోర్ట్ ఈ అమ్మాయికి ఉన్నా.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ తగలేకపోయినా.. అల్లు శిరీష్-వైష్ణవి చైతన్య కాంబోలో గీత ఆర్ట్స్ వారు ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికి వైష్ణవి చైతన్య ని బయటికి వెళ్లనివ్వకుండా గీత ఆర్ట్స్ వారు ముందర కాళ్ళకి బంధం వేస్తున్నారనేది వాస్తవమో కాదో.. తెలియాలంటే ఆమె రెండో ప్రాజెక్ట్ వివరాలు బయటికొచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Baby Heroine is a new project set:

Uncertain Future for Baby Heroine Vaishnavi Chaitanya?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement