Advertisementt

ఇండియాలోనే నెంబర్ 1 తారగా సమంత

Sat 22nd Jul 2023 10:00 AM
samantha  ఇండియాలోనే నెంబర్ 1 తారగా సమంత
Samantha is number 1 star in India ఇండియాలోనే నెంబర్ 1 తారగా సమంత
Advertisement
Ads by CJ

గత ఏడాదిలో ఆరు నెలలు సమంత అసలు సినిమాలే చెయ్యలేదు. ముందే చేసిన వాటిలో యశోద హిట్ గా నిలవగా.. శాకుంతలం ప్యాన్ ఇండియాలో బిగ్ షాక్ ఇచ్చింది. ఇక ఈ ఆరు నెలలుగా సమంత హీరో విజయ్ దేవరకొండ ఖుషి, సిటాడెల్ వెబ్ సీరీస్ లో నటించింది. ఈ మధ్యలో సమంత సినిమాలేవీ విడుదల కాలేదు. ఫ్యామిలీ మ్యాన్ తో ఫ్యాన్ ఇండియా హీరోయిన్ గా మారిన సమంత మాత్రం సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గానే ఉంటుంది. ప్రస్తుతం కూడా సోషల్ మీడియాలో రోజూ ట్రెండ్ అవుతుంది.

కారణం ఆమె సినిమాలకి ఓ ఏడాది కాలం పాటు దూరం కాబోతుంది. హెల్త్ ఇష్యుస్ ఆమెని వదలకపోవడంతో ఆ ఆరు నెలలు సమంత అమెరికా ప్రయాణం పెట్టుకుంది. అక్కడే ట్రీట్మెంట్ తీసుకోబోతుంది. ఈమధ్యనే యోగ కార్యక్రమంలో పాల్గొంది. ఇలా నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచే సమంత ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా నిలిచింది. ఓరామాక్స్ సర్వే లో సమంత నెంబర్  స్థానాన్ని ఆక్రమించింది. బాలీవుడ్ హీరోయిన్స్ ని వెనక్కినెట్టి మరీ సమంత నెంబర్ 1 లో నిలవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

సమంత తర్వాతే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రెండో స్థానంలో కనిపించింది. దీపికా పదుకొనే మూడో స్థానం, నయనతార నాలుగో  స్థానం, కాజల్ అగర్వాల్ ఐదో స్థానంలో నిలిచింది. 

Samantha is number 1 star in India:

  Samantha Indias popular female star

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ