Advertisementt

KGF దారిలోనే పుష్పరాజ్ దాడి

Mon 17th Jul 2023 09:50 PM
pushpa 2  KGF దారిలోనే పుష్పరాజ్ దాడి
Pushpa 2 in KGF lines KGF దారిలోనే పుష్పరాజ్ దాడి
Advertisement
Ads by CJ

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF పార్ట్ 1, పార్ట్ 2 లతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో సంచలన విజయాన్ని నమోదు చేసారు. KGF తో ఇండియా వైడ్ ప్రేక్షకులు కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా ప్రశాంత్ నీల్-యశ్ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసారు. KGF పార్ట్ 1 క్లైమాక్స్ లో హీరో యశ్.. విలన్ గరుడాని క్రూరాతి క్రూరంగా చంపెయ్యడంతో KGF 1 ముగిసి.. పార్ట్2 పై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసారు. కెజిఫ్ 2 లో హీరో యశ్ KGF బంగారు గనులకి రారాజుగా.. అందరితో శత్రుత్వం కొని తెచ్చుకుంటాడు. అతన్ని ఎప్పుడు చంపేద్దామా అని బోలెడంతమంది విలన్స్ వెయిటింగ్. అధీర, ఆఖరికి ఇండియా ప్రైమ్ మినిస్టర్, మిగతా విలన్స్ కలిసి కెజిఫ్ 2 క్లైమాక్స్ లో హీరోని చంపెయ్యాలి. కానీ ప్రశాంత్ నీల్ యశ్ సముద్రంలో మునిగిపోవడమే చూపించారు కానీ.. అతను చనిపోయినట్లుగా చెప్పలేదు. దానితో పార్ట్ 3 ఉంటుంది అనే హింట్ ఇచ్చి వదిలారు.

ఇప్పుడు సుకుమార్ కూడా KGF ని ఫాలో అవుతున్నారనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చెయ్యడమే కాకుండా.. సుకుమార్ దానికి సీక్వెల్ ప్రకటించారు. పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ లో పుష్ప రాజ్ కి భన్వర్ లాల్ షెకావత్ కి మధ్యన అగ్గిరేజేసి వదిలేసారు. అంటే పార్ట్2 లో పుష్ప రాజ్ కి భన్వర్ లాల్ లకి మధ్యన ఫుల్ గా యాక్షన్ ఉంటుంది అని ఈజీగా అర్ధమైపోతుంది. అయితే పుష్ప ద రూల్ లో పుష్ప రాజ్ కేరెక్టర్ ని క్లైమాక్స్ లో చంపెయ్యాల్సి ఉన్నప్పటికీ.. సుకుమార్ మాత్రం పుష్ప రాజ్ చనిపోయాడంటూనే మళ్ళీ పుష్ప రాజ్ ఉనికిని చూపిస్తూ పుష్ప పార్ట్ 3 పై హింట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

అంటే KGF లాజిక్ నే ఇప్పుడు సుకుమార్ పుష్ప సీక్వెల్ కి అప్లై చేయబోతున్నారన్నమాట. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ రేపు బుధవారం నుండి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలు కాబోతుంది. అలాగే KGF 3 ఎప్పుడు మొదలవుతుందో త్వరలోనే మేకర్స్ ప్రకటించబోతున్నట్లుగా టాక్.  

Pushpa 2 in KGF lines:

Pushpa 2 treading in KGF footprints

Tags:   PUSHPA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ