మొత్తం KGF ని దించేసారుగా

Thu 06th Jul 2023 10:26 AM
salaar  మొత్తం KGF ని దించేసారుగా
Comedy Memes on Salaar Teaser మొత్తం KGF ని దించేసారుగా
Advertisement
Ads by CJ

KGF మేకర్స్ నుండి నుండి వస్తున్న సలార్ కొత్తగా ఉంటుంది.. అంతే భారీ  స్థాయిలో డిఫరెంట్ గా తెరకెక్కింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సలార్ టీజర్ చూస్తుంటే అచ్చం KGF కి జిరాక్స్ కాపీలా అనిపిస్తుంది. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్, KGF మేకర్స్ హోంబేలె ఫిలిమ్స్ వారి నుండి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ టీజర్ ఈ రోజు తెల్లవారి ఝామున వదిలారు. అయితే సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తుంటే.. మిగతా మాస్ ఆడియన్స్ మాత్రం KGF కి సీక్వెల్ చేసారా భయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.

KGF లో యశ్ ని ఎంత క్రూరంగా చూపించారో.. KGF బంగారు గనుల్లో నల్లగా మసి పూసి మనుషులని చూపించిట్టుగానే ఇప్పుడు సలార్ టీజర్ ని కూడా బొగ్గు గనులల్లోనే చూపించారు.

వందలాదిమంది విలన్స్ గుంపులుగా KGF లో ఎలా అయితే హీరోపైకి దూకారో ఇక్కడ సలార్లోనూ అదే ఉంది. అక్కడ కూడా హీరోకి ఎంతయితే హైప్ ఇచ్చారో ఇక్కడ సలార్లోనూ ప్రభాస్ కి అలాంటి హైప్ ఇచ్చారు. KGF కి సీక్వెల్ గానే సలార్ ఉంది కానీ.. కొత్తగా ఏమి లేదు అనే కామెంట్స్ వినిపిస్తుంటే.. KGF లో హీరో యశ్-సలార్ లో హీరో ప్రభాస్ అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. 

సలార్ టీజర్ అని చెప్పి KGF టీజర్ చూపించవా ప్రశాంత్ నీల్, సలార్ లో ప్రభాస్ ని కొత్తగా చూపించావ్ కానీ.. KGF మాదిరిగా వైబ్స్ వచ్చేసరికి ఫాన్స్ కూడా కాస్త డిస్పాయింట్ అవుతున్నారు. 

Comedy Memes on Salaar Teaser:

 Funny Memes Goes Viral on Prabhas Salaar Teaser

Tags:   SALAAR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ