Advertisementt

సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం అయిపోయిందా

Sun 02nd Jul 2023 07:04 PM
sudigali sudheer,engagement,relative,rashmi gautham  సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం అయిపోయిందా
Sudigali Sudheer is secretly engaged సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం అయిపోయిందా
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం జరిగిపోయిందా.. అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా సర్కిల్స్. ఎప్పటినుండో రష్మీ గౌతమ్‌తో ప్రేమలో ఉన్నాడనే టాక్ రూమరే అయినా.. సుధీర్ ఫ్యాన్స్ మాత్రం రష్మీతో వివాహం అయితే బావుంటుంది అనే కోరికను బలంగా వినిపిస్తున్నారు. అందుకే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనే అనుమానాలు ఉండేవి. కానీ వారు మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కోసమే కలిశామని తెగ్గొట్టేశారు. అయితే ఆ తర్వాత సుధీర్ బుల్లితెర మీద నుండి వెండితెర మీదకి తన ఫోకస్ షిఫ్ట్ చేశాడు.

ప్రస్తుతం హీరోగా క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి షూటింగ్స్‌తో బిజీగా మారాడు. అయితే ఈమధ్యన తనకి మరదలు వరస అయ్యే అమ్మాయితో సుధీర్ పెళ్లి జరగబోతుంది అనే టాక్ నడిచింది. సుధీర్ తన బంధువులలోని ఒక అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడంటూ ఆ న్యూస్ చక్కర్లు కొట్టింది. తాజాగా సుధీర్ ఆ అమ్మాయితోనే నిశ్చితార్థం చేసుకున్నాడంటూ సోషల్ మీడియా టాక్. సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం కూడా కొద్దిమంది ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన సీక్రెట్‌గా జరిగిందని అనుకుంటున్నారు.

గత రెండు రోజులుగా సుధీర్ ఎంగేజ్‌మెంట్ న్యూస్ వైరల్ అవుతున్నా.. సుధీర్ మాత్రం ఈ విషయంపై స్పందించకుండా సైలెంట్‌గానే ఉన్నాడు. అయితే అది నిజమే అయ్యుంటుంది అందుకే సుధీర్ ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఇది నిజమా.. కాదా.. అనేది ప్రస్తుతానికి కన్ఫ్యూజనే.

Sudigali Sudheer is secretly engaged:

Sudigali Sudheer Engagement with Relative News Goes Viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ