Advertisement

ఎన్టీఆర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్

Sat 24th Jun 2023 09:36 AM
devara,ntr  ఎన్టీఆర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్
Fans saying hats off to Jr NTR ఎన్టీఆర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత దాదాపుగా ఏడాది ఖాళీగానే గడిపాడు. కొరటాలతో సినిమా మొదలు పెట్టడానికి ఏడాది పైగా సమయం తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు అస్సలు గ్యాప్ తీసుకోవడం లేదు. కొరటాలతో ఎన్టీఆర్ దేవర సెట్స్ మీదకి వెళ్ళింది మొదలు అప్పుడే ఐదు షెడ్యూల్స్ ని పూర్తి చేసెయ్యడం అంటే మాములు విషయం కాదు. అటు కొరటాల ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ ఫుల్ స్పీడులో దేవర షూటింగ్ లో పాల్గొంటున్నారు. మూడు నెలల్లో ఎన్టీఆర్ ఐదు షెడ్యూల్స్ కంప్లీట్ చేసేసాడు.

దానితో ఎన్టీఆర్ అభిమానులు Hats off to his speed, commitment, hardwork & dedication. The film is on track for Box Office storm from 5 April 2024. మీ స్పీడు కి హాట్స్ ఆఫ్, మీ హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ ఎగ్జైట్ అవుతున్నారు. ఏప్రిల్ 2024 బాక్సాఫీసు స్ట్రోమ్ గ్యారెంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరటాల పూర్తి స్క్రిప్ట్ తో సెట్స్ మీదకి వెళ్లడంతోనే ఇలా అనుకున్న సమయానికి దేవర షూటింగ్ కంప్లీట్ అవడం పక్కాగా కనిపిస్తుంది.

సైఫ్ అలీ ఖాన్-ఎన్టీఆర్ లపై పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలను కూడా కొరటాల ఇప్పటికే తెరకెక్కించగా.. జాన్వీ కపూర్-ఎన్టీఆర్ ల కాంబో సన్నివేశాలు, సాంగ్స్ ని మాత్రం అదిరిపోయే లొకేషన్స్ లో ప్లాన్ చేసుకున్నారట. 

Fans saying hats off to Jr NTR:

Devara is in full swing

Tags:   DEVARA, NTR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement