పవన్ పై గౌరవం పోయింది
Posani Krishna Murali Sensational Comments On Pawan Kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే గౌరవం పోయింది అంటూ పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో పవన్ కళ్యాణ్ పై రాజకీయపరంగా ఈరకమైన వ్యాఖ్యలు చేసి పవన్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేసారంటూ నానా యాగీ చేసి.. వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ అక్కడి పదివికి అనుభవిస్తున్న పోసాని కృష్ణమురళీ తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై ఈ విధమైన కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేపట్టి బహిరంగ సభలు పెట్టి వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.
వైసీపీ నేతలు, జగన్ కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన vs జగన్ ప్రభుత్వం అన్న రేంజ్ లో అది. పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు కిందా మీదా పడుతున్నారు. అయితే ఇప్పుడు పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. నేను పవన్ కల్యాణ్ గురించి చాలా ఊహించుకున్నా.. పవన్ రాజకీయాలు చూశాక.. ఆయనపై గౌరవం పోయింది.. పవన్ ఒకప్పుడు చాలా మంచివాడు.. ఇప్పుడు పిచ్చివాడు ఎందుకయ్యాడో తెలియదు అంటూ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో కూడా తెలియదు. సినిమా ఆర్టిస్ట్ అనే జనం పవన్ రోడ్డు షోలకు వస్తున్నారన్నారు తప్ప పవన్ పైఎలాంటి ప్రేమ లేదు. సీఎం అయ్యే దైర్యం మీకు ఉంటే ఎందుకు ముందుకు రావడం లేదని పోసాని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి సాయం చేస్తుంటారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మాయలో పడ్డారని.. తప్పు చేస్తున్నావ్ పవన్ కళ్యాణ్.. నువ్వే తిట్టి దూరం చేసుకుంటున్నావ్ అంటూ పవన్ పావు పోసాని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన పోసాని.. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి ఎదురు నిలుస్తూ జగన్ ప్రభుత్వ మెప్పు పొందేందుకు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు అనుగుణంగానే ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు పోసానిపై ఫైర్ అవుతున్నారు.
Posani Krishna Murali Slams Pawan Kalyan







































