పవన్ ఆరాధించే హీరోలు ఎవరో తెలుసా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆరాధించే అభిమానులే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఆయన్ని అభిమానించే హీరోలు, హీరోయిన్స్, నటీనటులు చాలామందే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానించే, ఆరాధించే హీరోల పేర్లు తెలిస్తే అందరికి సర్ప్రైజింగ్ గా అనిపించడం ఖాయం. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో భాగంగా వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసిపీ మంత్రులని, సీఎం జగన్ ని మాటల తూటాలతో చీల్చి చెండాడుతున్నారు.
నిన్న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు. తన తోటి నటీనటులు అంటే తనకెంతో గౌరవం ఉందని, వారి సినిమాలను కూడా చూస్తానని వెల్లడించిన పవన్.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి అంటే తనకి చాలా ఇష్టమని, వారి నటన అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో అటు ఎన్టీఆర్ ఫాన్స్, ఇటు మెగా ఫాన్స్, ప్రభాస్ ఫాన్స్ అంతా చాలా ఎగైట్ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ క్రేజీ హీరోగా పవన్ కళ్యాణ్ నే చెబుతారు. అలాంటి హీరో ఈ హీరోలని ఆరాధించడం నిజంగా షాకింగ్ విషయమే.
I Love Chiranjeevi, Prabhas,Ram Charan ,Jr NTR Acting Says Pawan Kalyan
Pawan Kalyan about Prabhas and NTR







































