Advertisementt

బాలీవుడ్ పై తాప్సి సెన్సేషనల్ కామెంట్స్

Sat 17th Jun 2023 12:40 PM
taapsee pannu  బాలీవుడ్ పై తాప్సి సెన్సేషనల్ కామెంట్స్
Taapsee Sensational Comments on Bollywood బాలీవుడ్ పై తాప్సి సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారలేకపోవడంతో ఇక్కడి నుండి బాలీవుడ్ ని నమ్ముకుని అక్కడ సెటిల్ అయిన తాప్సి పన్ను.. హిందీలో విమెన్ సెంట్రిక్ మూవీస్ తో సత్తా చాటుతుంది. అయితే తాప్సి ఇప్పటివరకు హిందీలో స్టార్ హీరోలతో నటించిన సందర్భం కనిపించలేదు. హిందీలో కాస్త నిలదొక్కుకున్నాక సౌత్ దర్శకులపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇక్కడి దర్శకులు స్కిన్ షో కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, హీరోయిన్స్ ని బొమ్మల్లా చూస్తారంటూ మాట్లాడింది.

అయితే బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది, ఇకపై సౌత్ సినిమాల్లో కనిపించదేమో అందుకే ఇలా మాట్లాడుతుంది అనుకున్నారు. కానీ తాప్సి ఇప్పుడు బాలీవుడ్ పై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది. అక్కడి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించాలంటే ఆషామాషీ విషయం కాదు. ఒక సినిమాలో ఎవరు నటించాలో అనేది అక్కడి కొంతమంది ప్రముఖ నటులు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి నచ్చకపోతే టాలెంట్ ఉన్నా పక్కనపడేస్తారు. కేరెక్టర్ కి సూట్ కాకపోయినా వాళ్ళు సెలెక్ట్ చేసే వాళ్ళనే తీసుకుంటారు.

ఆ కేరెక్టర్ కి సూట్ అవుతారన్న వారిని కూడా పట్టించుకోరు. వాళ్లకి కావాల్సిన వాళ్ళనే తీసుకుంటారు . హిందీలో ఫెవరేటిజం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఏజెన్సీ వాళ్ళని కూడా రిఫర్ చేస్తారు.. టాలెంట్ ఉండి.. అవకాశాల కోసం తిరగడం బాలీవుడ్ లో వేస్ట్ అంటూ తాప్సి బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Taapsee Sensational Comments on Bollywood:

Taapsee Pannu on the dark side of Bollywood camps

Tags:   TAAPSEE PANNU
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ