పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG షూట్ లోకి ఎంటర్ అయ్యాక చాలా స్టయిల్ గా కనబడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో సినిమాల విషయంలో ఆయన నార్మల్ లుక్స్ లోనే కనిపించినా.. OG కి వచ్చేసరికి స్టయిల్ మొత్తం మార్చేశారు. అయితే పవన్ కళ్యాణ్ క్యాజువల్ గానే కనిపించినా ఆయన ఫాన్స్ విపరీతమైన క్రేజ్. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారారు. రెండు రోజుల క్రితం పట్టు వస్త్రాల్లో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో యాగం నిర్వహించారు.
ఇక నిన్న అన్నవరం నుండి వారాహి యాత్ర మొదలు పెట్టారు. నేడు పవన్ కళ్యాణ్ జనవాణి అంటూ ప్రజాసమస్యలని తెలుసుకోవడానికి మీటింగ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ కోసం పొలిటికల్ డ్రెస్లోనే హాజరైనా ఆయన స్టయిల్ మాత్రం కొత్తగా కనిపించింది. పవన్ కళ్యాణ్ అలా నడుచుకుంటూ వస్తుంటే.. నిజంగా పవన్ ఫాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. మా హీరో రాజకీయాల్లో కూడా స్టయిల్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.
అసలు పవన్ ఎలా ఉన్నా ఆయన ఫాన్స్ కి నచ్చడం కాదు కానీ.. నిజంగానే పవన్ కళ్యాణ్ చాలా స్టయిల్ గా కనిపించారు. ప్రస్తుతం జనసేనాని న్యూ లుక్ వైరల్ గా మారింది.




విజయ్ దేవరకొండ లుక్స్ పై ఫాన్స్ కంప్లైంట్స్

Loading..