Advertisementt

నాగార్జున కొత్త సినిమా కబురేది?

Wed 14th Jun 2023 05:18 PM
nagarjuna  నాగార్జున కొత్త సినిమా కబురేది?
Nagarjuna new movie update? నాగార్జున కొత్త సినిమా కబురేది?
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున కొత్త సినిమాపై ఈ వారంలో కబురొస్తుంది అంటూ అక్కినేని అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. నాగార్జున ద ఘోస్ట్ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమా ప్రకటించలేదు. ప్రసన్న కుమార్ తో నాగార్జున సెట్స్ మీదకెళ్ళబోతున్నారనే న్యూస్ చక్కర్లు కొట్టినా.. అది జరగలేదు. మలయాళ మూవీ రీమేక్ అన్నారు అదీ లేదు. జూన్ మొదటి వారంలోనే నాగార్జున కొత్త సినిమా కబరందుతుంది, మూడో వారం నుండి కొత్త సినిమా మొదలవుతుంది ఇలా చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కానీ నాగార్జున మాత్రం కొత్త సినిమా విషయంలో ఒక నిర్ణయానికి రాలేదా.. లేదంటే మారేదన్నా కారణమా అనేది తెలియక అక్కినేని అభిమానులు సతమతమవుతున్నారు. మరోపక్క కొడుకుల భవిష్యత్తుపై నాగార్జున బెంగపెట్టుకున్నారట. అటు అఖిల్, ఇటు నాగ చైతన్య ఇద్దరూ ఈమధ్యనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అందుకుని డిస్పాయింట్ మోడ్ లో కనిపిస్తున్నారు. దానితో వారి కెరీర్ ని గాడిన పెట్టాలని నాగార్జున కంకణం కట్టుకున్నట్టుగా చెబుతున్నారు.

అయితే ఘోస్ట్ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటాను అని చెప్పినట్టుగానే నాగార్జున ఆ ఆరు నెలల బ్రేక్ ని పూర్తి చేసి కూడా మూడు నెలలవుతుంది. మరి నాగ్ కొత్త సినిమా కబురు ఎప్పుడు వినిపిస్తుందో చూద్దాం.

Nagarjuna new movie update?:

Nagarjuna takes break from film industry

Tags:   NAGARJUNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ