Advertisementt

గుంటూరు మిర్చిలా శ్రీలీల

Wed 14th Jun 2023 10:05 AM
guntur kaaram,sreeleela  గుంటూరు మిర్చిలా శ్రీలీల
Guntur Kaaram team wishes Sreeleela గుంటూరు మిర్చిలా శ్రీలీల
Advertisement
Ads by CJ

క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ శ్రీలీల బర్త్ డే నేడు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న శ్రీలీల డాన్స్ లకి ఫిదా కానీ వారు ఉండరు. పెళ్లి సందడి ప్లాప్ అన్నా ఆ సినిమాని ఓటిటిలో ఎగబడి చూసింది శ్రీలీల కోసమే. ధమాకా కి టాక్ తో సంబంధం, లేకుండా కలెక్షన్స్ రావడానికి రీజన్ శ్రీలీల ఎనెర్జిటిక్ డాన్స్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేసేలా శ్రీలీల లుక్స్ కానీ డాన్స్ కనిపించాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ అండ్ యంగ్ హీరోల ప్రాజెక్ట్స్ తో ఏ హీరోయిన్ కి లేని బిజీ శ్రీలీల దగ్గరే ఉంది.

జూన్ 14 శ్రీలీల బర్త్ డే సందర్భంగా ఆమె మహేష్ తో నటిస్తున్న గుంటూరు కారం నుండి శ్రీలీల ఫస్ట్ లుక్ ని వదిలారు. కాలి వేళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటూ బ్యూటిఫుల్ గా లంగావోణీ లుక్ లో అందంగా కనిపించింది. మెరూన్ కలర్ అవుట్ ఫిట్ లో ట్రెడిషనల్ గానే కనిపించినా ఆమె కళ్ళలోని గుంటూరు ఘాటు చక్కగా తెలిసిపోతుంది. గుంటూరు కారం ఫస్ట్ లుక్ లో మహేష్ ఎంత మాసివ్ గా  రఫ్ గా ఉన్నారో.. దానికి తగ్గ లుక్ లోనే శ్రీలీల గుంటూరు మిర్చిలా కనిపించింది.

ఆమె నటిస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో మహేష్ నుండే ఆమెకి మొదటి ఫస్ట్ లుక్, మొదటి బర్త్ డే విషెస్ అందాయి. శ్రీలీల గుంటూరు కారంలో మాస్ గానే కనిపించబోతున్నట్లుగా ఈ లుక్ చూస్తే తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో పూజ హెగ్డే కూడా నటిస్తుంది. 

Guntur Kaaram team wishes Sreeleela :

Guntur Kaaram team wishes Sreeleela a very Happy Birthday! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ