పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు కాపు కాచుకుని కూర్చుంటారు. ఆయనతో సినిమా చెయ్యాలని చాలామంది ఆశపడతారు. అందులో కొంతమందికి ఆ ఆఫర్ వస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ కోసం వారు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. పవన్ ఎక్కడ ఉంటే అక్కడే సినిమాలు చెయ్యడానికైనా ఆ నిర్మాతలు రెడీగా ఉంటారు. పవన్ కి అనుకూలంగా చాలామంది సెట్స్ వేసి హైదరాబాద్ లోనే ఎక్కువగా షూటింగ్స్ చుట్టేస్తారు. పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ళకి హైదరాబాద్ వదిలి ఈ మధ్యనే OG కోసం ముంబై కదిలారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కోసం ఏపీ వెళ్లారు. ఏపీలో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో యాగం చేసి రేపు జూన్ 14 న వారాహి యాత్రని తూర్పు గోదారి జిల్లాలో అన్నవరం సత్యదేవుని దర్శనానంతరం మొదలు పెట్టబోతున్నారు. అయితే మంగళగిరి వెళ్లిన పవన్ అక్కడ యాగం చెయ్యడంతో పవన్ తో పని చేసే దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు దానయ్య, AM రత్నం, మైత్రి మూవీస్ మేకర్స్ అందరూ పవన్ కళ్యాణ్ కోసం మంగళగిరి వెళ్లారు.
అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పవన్ వారాహి యాత్ర సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటే అక్కడే షూటింగ్, ఆయన మంగళగిరిలో ఉంటే మంగళగిరిలో షూటింగ్ పెడతాం.. అంటూ మాట్లాడుతున్నారు. అంటే విజయవాడ, గుంటూరులో పవన్ షూటింగ్స్ ఎమన్నా ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఇలా వారు చెప్పడం చూస్తే పవన్ కోసం ఎంతెలా వారు వెయిట్ చేస్తున్నారో అర్ధమవుతుంది.




ఆదిపురుష్ కి తెలంగాణ ప్రభుత్వ అండ 

Loading..