Advertisementt

మోక్షజ్ఞ న్యూ మేకోవర్: ఇది నిజామా? కలా?

Sat 10th Jun 2023 09:11 PM
nandamuri mokshagna  మోక్షజ్ఞ న్యూ మేకోవర్: ఇది నిజామా? కలా?
Mokshagna New makeover మోక్షజ్ఞ న్యూ మేకోవర్: ఇది నిజామా? కలా?
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ బర్త్ డే వచ్చింది.. నందమూరి అభిమానుల సెలెబ్రేషన్స్ తో బాలయ్య కొత్త సినిమాల అప్ డేట్స్ తో ఆల్మోస్ట్ ఈ డే ముగిసిపోయింది. భగవంత్ కేసరిగా బాలయ్య విశ్వరూపం చూసాక నందమూరి ఫాన్స్ హ్యాపీనే.. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ అప్ డేట్ కోసం వెయిట్ చేసి చేసి నందమూరి ఫాన్స్ అలిసిపోయారు. ఈరోజైన అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూసారు. కానీ ఎప్పటిలాగే డిస్పాయింట్ అయ్యారు. గత ఏడాది బాలయ్య బర్త్ డే కి మోక్షజ్ఞ టర్కీ వెళ్లి తండ్రితో కేక్ కట్ చేయించాడు. మధ్యలో బాలయ్య తో కలిసి హిట్ 2 చూసాడు. 

వీరసింహ రెడ్డిని అభిమానులతో కలిసి వీక్షించాడు. అయితే బాలయ్య బర్త్ డే కి మోక్షజ్ఞ కనిపించకపోయినా.. మోక్షజ్ఞ న్యూ మేకోవర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. నిజంగా అది చూస్తే అందరూ షాక్. ఇంతిలాంటి మేకోవర్ మోక్షజ్ఞకి సాధ్యమా అనేలా ఉందా పిక్. అది నిజమా.. లేదంటే ఏదైనా మాయా అనుకుంటున్నారూ. ఎందుకంటే మోక్షజ్ఞ ఎప్పుడు కనిపించినా కాస్త బబ్లీగానే కనిపిస్తాడు. పొట్టతో, మొహంలో అతని వెయిట్ స్పష్టంగా కనిపిస్తుంది.

మొన్నటికి మొన్న తారకరత్న మరణించినప్పుడు కూడా మోక్షజ్ఞ కాస్త బరువుగానే కనిపించాడు. ఇంతలోనే మోక్షజ్ఞ ఇలాంటి లుక్ లోకి మారిపోయాడు.. ఏముంది జిమ్ ట్రైనర్ ని పెట్టుకుంటే అవ్వొచ్చు కానీ.. మోక్షజ్ఞ ఇన్నాళ్ళుగా చెయ్యలేని పని ఈ ఆరు నెలల్లో చేశాడా అనేదే కొంతమందికి ఇప్పుడొస్తున్న అనుమానం. అందుకే ఆ లుక్ చూడగానే మోక్షజ్ఞ స్లిమ్ లుక్ లో.. ఇది నిజంగా నిజమా అంటూ నోరెళ్లబెడుతున్నారు. 

Mokshagna New makeover:

Nandamuri Mokshagna New Look

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ