Advertisement

పెళ్లి పీటలెక్కిన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ కమెడియన్స్ ఒక్కొక్కరిగా లైఫ్ లో సెటిల్ అయ్యి ఇల్లు, కార్లు కొనుక్కుని ఓ ఇంటివారవడమే కాదు.. తమ లైఫ్ లో కి లైఫ్ పార్ట్నర్స్ ని ఆహ్వానిస్తున్నారు. అవినాష్, ఆర్పీ లాంటి వారు జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళాక లైఫ్ పార్ట్నర్స్ ని సెట్ చేసుకోగా.. కెవ్వు కార్తిక్ ఇన్నాళ్ళకి ఓ అమ్మాయి ని తన జీవితంలోకి ఆహ్వానించాడు. రీసెంట్ గానే తానూ చేసుకోబోయే అమ్మాయి సిరిని పరిచయం చేసాడు.

ఇంతలోపునే సిరితో ఏడడుగులు నడిచి ఓ ఇంటివాడయ్యాడు. గత వారం రోజులుగా పెళ్లి షాపింగ్ అంటూ బంగారం కొనడం, బట్టలు కొనడం అన్నీ యూట్యూబ్ వీడియోస్ లో చూపిస్తున్న కెవ్వు కార్తిక్ నిన్న రాత్రి సిరితో ఏడడుగులు నడిచి ఆమె మెడలో మూడు ముళ్ళూ వేసాడు. అంగరంగ వైభవంగా జరిగిన కార్తీక్ పెళ్ళిలో పలువురు కమెడియన్స్ సందడి చేసారు. శ్రీను వైఫ్ సుజాతతో కలిసి కార్తిక్ పెళ్ళికి వెళ్ళాడు.

వైవాహిక జీవితంలోకి అడుగెట్టిన మా @kevvukartheek #srilekha లకు ..మీరు జీవితాంతం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ.. ఇరువురికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు 💐💐#happywedding అంటూ కెవ్వు కార్తిక్ పెళ్లి ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు శ్రీను.

Kevvu Karthik wedding pic viral

Jabardasth comedian who got married
kevvu karthik