Advertisementt

ఎంగేజ్మెంట్ లోనే కాదు పెళ్ళిలోనూ వీరే స్పెషల్

Mon 05th Jun 2023 02:44 PM
siddharth,aditi rao  ఎంగేజ్మెంట్ లోనే కాదు పెళ్ళిలోనూ వీరే స్పెషల్
They are special not only in engagement but also in marriage ఎంగేజ్మెంట్ లోనే కాదు పెళ్ళిలోనూ వీరే స్పెషల్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరో శర్వానంద్ కొద్ది నెలల క్రితమే ప్రేమించిన అమ్మాయి రక్షిత రెడ్డితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. శర్వా నిశ్చితార్ధనికి టాలీవుడ్ నుండి యంగ్ హీరోస్, మెగా ఫ్యామిలీలో చిరు-సురేఖ, రామ్ చరణ్ దంపతులు.. ముఖ్యంగా లవ్ బర్డ్స్ కింద ప్రొజెక్ట్ అవుతున్న సిద్దార్థ్-అదితి రావు లు ప్రత్యేకంగా హాజరయ్యారు. శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో ఎవరు ఎలా కనిపించినా సిద్దార్థ్-అదితి రావులే సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. 

ఇక ఇప్పుడు శర్వానంద్ పెళ్ళిలోనూ ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ హాజరై స్వీట్ షాకిచ్చారు. అత్యంత సన్నిహితులు మాత్రమే శర్వానంద్ రాయల్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్ కి వెళ్లారు. అందులో మెగా హీరో రామ్ చరణ్ అలాగే సిద్దార్థ్-అదితిలు మాత్రమే ఈ పెళ్ళిలో సందడి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే సిద్దార్థ్-అదితిలు కొన్ని రోజులుగా కలిసి తిరుగుతున్నారు. కలిసి కనిపిస్తున్నారు, రెస్టారెంట్స్ లోనే కాదు ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు, ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు.

అయినా మేము ప్రేమికులమని ఒప్పుకోరు, క్లారిటీ ఇవ్వరు. ఇప్పుడు శర్వానంద్ పెళ్ళికి కూడా ఇద్దరూ కలిసే రాజస్థాన్ కి వెళ్లొచ్చారు. శరానంద్ పెళ్ళికి సిద్దు-అదితిలు అలా కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన పిక్స్, వీడియోస్ వైరల్ అయ్యాయి. శర్వా పెళ్ళిలో సిద్దు-అదితిల ఫొటోస్ మాత్రం బయటికి రాకపోయినా.. వీరిద్దరూ శర్వా పెళ్ళిలో ప్రత్యేకంగా కనిపించారని తెలుస్తుంది. 

They are special not only in engagement but also in marriage:

Siddharth and Aditi special attraction in Sharwanand wedding

Tags:   SIDDHARTH, ADITI RAO
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ