మన దేశంలో రిక్షాలు లేక వేరే దేశంకి వెళ్లి రిక్షా ఎక్కి ఒక రౌండ్ కొట్టా.. ఇది జగ్గుభాయ్ అదే మన జగపతిబాబు చేసిన ట్వీట్. ఈ ట్వీట్ చూసి నవ్వాలో, ఏడవాలో జనాలకి అర్థం కావడం లేదు. అంటే భారతదేశంలో రిక్షాలు తొక్కుకునే వారు లేరు.. అంత డెవలప్ అయిందని అర్థం చేసుకోవాలో.. లేదంటే భారతదేశంలో రిక్షాలు కూడా కనుమరుగయ్యాయని బాధపడాలో తెలియడం లేదంటూ కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
నిజంగా భారతదేశంలో రిక్షాలు లేవా? లేక జగపతిబాబుకి ఎక్కడ ఉన్నాయో తెలియదా? ఒక్క హైదరాబాద్‌లో రిక్షాలు లేకపోతే.. వేరే చోట రిక్షాలు లేవని ఎలా జగపతిబాబు డిసైడ్ అయ్యాడో తెలియదు కానీ.. ఆయన చేసిన ట్వీట్‌కు కొందరు నెటిజన్లు.. మా ఊరు రండి సార్.. బోలెడన్ని రిక్షాలు ఉన్నాయి. ఒకటి కాదు, పది రౌండ్‌లు కొట్టవచ్చు అంటూ జగ్గుభాయ్‌కి ఆహ్వానం పలుకుతున్నారు. ఇంకొందరు నెటిజన్లు అయితే ఇంకా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. వాటిలో కొన్ని..
-మీకు దమ్ముంటే మన కంట్రీలో ట్రైన్ ఎక్కండి సార్ చూద్దాం?
-రిక్షాలు ఉన్నాయ్ అండి. మా ఊరు రండి, వెరైటీగా ఉంటుంది రిక్షా ప్రయాణం. మీ యాత్రను ఆనందించండి.
-క్యాసినో లో డబ్బులు పోయిన తర్వాత కారులో పోవడానికి నోట్లు లేక రిక్షాలో పోవడం సూపర్..
-సర్ రిక్షాలు ఉన్నాయి సర్.. వారి బ్రతుకులే మారలేదు.. ఓకే వాళ్లకి హెల్ప్ చేయండి సార్..
-మన దగ్గర ఇప్పుడు రిక్షాలు ఎక్కితే.. గతుకుల రోడ్స్ వల్ల నడుములు ఇరుగుతాయి
-ఇది ఇండియా.. ఇక్కడ అన్నీ కనుమరుగే.. ఇలా నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్‌తో జగ్గుభాయ్ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తున్నారు.
Mana desam lo rickshaw lu leka verey desam ki veli rickshaw eki oka round kota.... pic.twitter.com/q7c4WR2lOL
— Jaggu Bhai (@IamJagguBhai) June 3, 2023




                     
                      
                      
                     
                    
 గుంటూరు కారం షూటింగ్ పోస్ట్ పోన్?

 Loading..