ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Do You Know Who Leaked the Title Of NBK108?

NBK108 టైటిల్ లీక్ చేసిందెవరో తెలుసా?

Do You Know Who Leaked the Title Of NBK108?Do You Know Who Leaked the Title Of NBK108?

బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న NBK108 టైటిల్ ఇదే అంటూ నిన్నటి నుండి సామాజిక మాద్యమాలలో ఓ టైటిల్ చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా NBK108 టైటిల్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసుకోగా...ఇప్పుడా టైటిల్ రివీల్ అయ్యి వైరల్‌గా మారింది. భగవత్ కేసరి ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య సినిమాకి అనిల్ రావిపూడి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాడంటూ ఆ లీకు వార్తల సారాంశం.

అయితే ఈ టైటిల్ ఇంతిలా లీకై సోషల్ మీడియాలో వైరల్ అవడానికి కారణం నందమూరి బాలకృష్ణేనట. ఇప్పటివరకు ఈ టైటిల్ ఎవరు లీక్ చేశారో అర్థం కాక NBK108 మేకర్స్ తర్జనభర్జన పడుతుంటే.. బాలకృష్ణ గారే తనని కలవడానికి వచ్చిన ఓ ప్రొడ్యూసర్ తో NBK108 లోని తన పాత్ర గురించి దాని పేరు చెబుతూ అందులోనే టైటిల్ ఉంటుంది అని చెప్పడంతో సదరు ప్రొడ్యూసర్ ఆ టైటిల్ ని బయట లీక్ చేసి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అలా బాలయ్య కొత్త సినిమా టైటిల్ వైరల్‌గా మరింది. ఈ టైటిల్ విషయంలో నందమూరి అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. కొద్దిరోజులైతే ఈ టైటిల్ ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది అనే అభిప్రాయాలను వినిపిస్తున్నాయి. ఇకపోతే కాజల్ ఫస్ట్ టైమ్ బాలయ్య సరసన ఈ చిత్రంలో నటిస్తుండగా.. శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్‌గా కనిపించబోతున్నారు.

Balayya leaked his NBK108 Title at One of the Producer in Industry

balakrishna
nbk108
bhagavath kesari