Advertisementt

బిచ్చగాడు 2 ఓటిటీ రాక అప్పుడే..!

Fri 26th May 2023 12:21 PM
bichagadu 2  బిచ్చగాడు 2 ఓటిటీ రాక అప్పుడే..!
Bichagadu 2 OTT Release Date - Digital Rights details బిచ్చగాడు 2 ఓటిటీ రాక అప్పుడే..!
Advertisement
Ads by CJ

బిచ్చగాడు హిట్ తో దానికి సీక్వెన్స్ అంటూ విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులని బాగా మెస్మరైజ్ చేస్తున్నారు. బిచ్చగాడు సక్సెస్ తర్వాత విజయ్ ఆంటోని నుండి ఆరేడు సినిమాలు వచ్చినా పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు బిచ్చగాడు2 కి పట్టం కట్టారు. తమిళ హీరోని తమిళ తంబీలు లైట్ తీసుకున్నా తెలుగు ప్రేక్షకులు మాత్రం విజయ్ ఆంటోనికి నెత్తిన పెట్టుకుంటున్నారు. బిచ్చగాడు 2 తెలుగులో వారం తిరక్కుండానే బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టింది.

తమిళంలో హిట్ కాకపోయినా.. తెలుగులో హిట్ అయిన బిచ్చగాడు2 మూవీని ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి తెస్తారా అని ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. బిచ్చగాడు 2 ఓటీటీ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. మే 18 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రాన్ని నెల తిరక్కుండానే అంటే జూన్ మూడో వారంలో తెలుగు సహా తమిళ్ లో స్ట్రీమింగ్ కి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పుడు హిట్ అయిన సినిమాలు నాలుగు వారాలు, ప్లాప్ సినిమాలు మూడు వారాల్లోనే ఓటిటీలో ప్రత్యక్షమవుతున్నాయి. అలా బిచ్చగాడు 2 కూడా జూన్ మూడో వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

Bichagadu 2 OTT Release Date - Digital Rights details :

Bichagadu 2 OTT Release Date - Digital Rights details out

Tags:   BICHAGADU 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ