వైరల్: కీర్తి సురేష్ లేటెస్ట్ సారీ లుక్

మహానటి కీర్తి సురేష్ నాని దసరాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. 100 కోట్ల క్లబ్బులో హుందాగా కాలు పెట్టిన కీర్తి సురేష్ వెన్నెలగా తన పెరఫార్మెన్స్, డాన్స్ తో మరోసారి ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. అయితే దసరా తర్వాత కీర్తి సురేష్ తమిళ, తెలుగు భాషలతో పాటుగా మలయాళ ఫిలిమ్స్ లో నటిస్తూ బిజీగా కనిపిస్తుంది. ఇదే సమయంలో ఆమె పెళ్లి చేసుకోబోతుంది. కేరళకి చెందిన యువ వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ ఏడడుగులు నడిచేందుకు రెడీ అయ్యింది అనే ప్రచారం జరుగుతుంది.

రీసెంట్ గా ఓ వ్యక్తితో క్లోజ్ గా ఉండడమే కాకుండా అతనికి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పడంతో కీరి సురేష్ అతన్నే పెళ్లి చేసుకోబోతుంది అంటున్నారు. సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా చాలా యాక్టీవ్ గా ఉంటున్న కీర్తి సురేష్ తరచూ తన లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. తాజాగా షిమ్మర్ సారీ లుక్ ని షేర్ చేసింది. షిమ్మర్ సారీ లో కీర్తి సురేష్ లూజ్ హెయిర్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అదరగొట్టేసింది.

అయితే సోషల్ మీడియాలో పెళ్లి పై జరుగుతున్న ప్రచారానికి కీర్తి సురేష్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం లేదు. సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతూ.. ఇలా స్పెషల్ ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో వదులుతూ స్టార్ ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. 

Latest Look of Keerthy Suresh Sparks Rumours

Latest Photo Of Keerthy Suresh
keerthy suresh