Advertisement

బిచ్చగాడు 2 మొదటి రోజు లెక్కలు

Sat 20th May 2023 11:49 AM
bichagadu 2  బిచ్చగాడు 2 మొదటి రోజు లెక్కలు
Bichagadu 2 first day collections బిచ్చగాడు 2 మొదటి రోజు లెక్కలు
Advertisement

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బిచ్చగాడు కి సీక్వెల్ గా చేసిన బిచ్చగాడు 2 నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే బిచ్చగాడు సక్సెస్ ని బిచ్చగాడు సీక్వెల్ కంటిన్యూ చెయ్యలేకపోయింది. బిచ్చగాడు అంత స్ట్రాంగ్ కంటెంట్ బిచ్చగాడు 2 లో లేకపోవడం.. అక్కడ మథర్ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లుగా బిచ్చగాడు 2 లో సిస్టర్ సెంటిమెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు జస్ట్ యావరేజ్ టాక్ ఇచ్చారు. అయితే బిచ్చగాడు ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో ఎంతగా ఉందో బిచ్చగాడు2 ఓపెనింగ్స్ చూస్తే అర్ధమవుతుంది. 

విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మొదటి రోజు ఏపీ మరియు తెలంగాణాలో దాదాపుగా 2.30 కోట్ల షేర్ 4 కోట్ల గ్రాస్ తెచ్చింది.

ఏరియాల వారీగా బిచ్చగాడు 2 కలెక్షన్స్.. 

👉నైజాం               - 75L

👉సీడెడ్                - 35L

👉అర్బన్ ఏరియా     - 32.5L

👉ఈస్ట్ గోదావరి        - 20L

👉వెస్ట్ గోదావరి         - 14L

👉గుంటూరు             - 24L

👉కృష్ణ                    - 18.5L

👉నెల్లూరు                 - 11L

Total AP&TS Day1 Share: 2.31Cr (Gross 4Cr).

Bichagadu 2 first day collections:

Bichagadu 2 first day AP and TS collections

Tags:   BICHAGADU 2
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement