Advertisementt

ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ అవుతుందట

Wed 17th May 2023 10:38 AM
prabhas,salaar  ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ అవుతుందట
It will be the best in Prabhas career ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ అవుతుందట
Advertisement
Ads by CJ

ప్రభాస్ బాహుబలి తో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ క్రేజ్ నిలబెట్టుకోవడానికి ఎక్కువగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నే చేస్తున్నారు. సలార్, ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్ K ఇలా అన్నీ వరసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రతీది క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో ప్రభాస్ పై వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు నిర్మాతలు. అయితే ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 28 న రిలీజ్ కాబోతున్న సలార్ టీజర్ కోసం ప్రభాస్ ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు.

రీసెంట్‌గా 35 కోట్ల ఖర్చుతో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ని భారీగా చిత్రీకరించారట. ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో భాగమైన ప్రతి ఒక్కరూ ఈ సన్నివేశం చాలా బాగా వచ్చిందని హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సలార్ ప్రీ ఇంటర్వెల్ లో వస్తుంది అని.. ఈ సీక్వెన్స్ ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలవబోతుంది అంటున్నారు. ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డ్ మరియు ప్రభాస్ యొక్క భారీ ఇమేజ్ సలార్ మేకర్స్ కి బాగా కలిసొస్తాయని.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమంటున్నారు.

రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా భయంకరంగా కనిపిస్తుండగా, జగపతి బాబు.. ఇంకా కొంతమంది విలన్స్ కీలకంగా కనిపిస్తారట. శృతి హాసన్ హీరోయిన్ గా ప్రభాస్ తో మొదటిసారి రొమాన్స్ చేయబోతుంది.

It will be the best in Prabhas career:

Prabhas Career Best Interval Block For Salaar

Tags:   PRABHAS, SALAAR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ