Advertisementt

కూతుర్ని మిస్ అవుతూ కళ్యాణ్ దేవ్ పోస్ట్

Wed 10th May 2023 06:32 PM
kalyan dev  కూతుర్ని మిస్ అవుతూ కళ్యాణ్ దేవ్ పోస్ట్
Kalyan Dev Emotional About His Daughter కూతుర్ని మిస్ అవుతూ కళ్యాణ్ దేవ్ పోస్ట్
Advertisement

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్-ఆయన కూతురు శ్రీజ విడాకులు తీసుకున్నారని ప్రచారం జరగడమే కానీ.. ఇంతవరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో శ్రీజతో ఉన్న పిక్స్ తీసేసాడు. శ్రీజ ఇంటిపేరు కొణిదెలాగా మార్చేసింది. అటు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. కళ్యాణ్ దేవ్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూతురు నివిష్కని మిస్ అవుతున్నట్టుగా పోస్ట్ లు పెడుతుంటాడు. 

శ్రీజతో విడిపోయిన విషయాన్ని చెప్పకుండానే ఇండైరెక్ట్ గా పోస్ట్ లు రూపంలో తెలియజేస్తూ ఉంటాడు. తాజాగా తన కూతురు నివిష్కని శ్రీజ మొదటి కూతుర్ని మిస్ అవుతున్నట్టుగా పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఓ వీడియో ని పోస్ట్ చేసాడు. ఓ స్కూల్ లో ఓ పాప స్కూల్ ఈవెంట్ లో పాల్గొంటుంది. స్టేజ్ పై నుండే తల్లితండ్రుల కోసం ఆ పాప వెతుకుతుంది. అక్కడ పేరెంట్స్ ని చూడగానే ఆ పాప ఎగ్జైట్ అయిన వీడియోని షేర్ చేస్తూ పిల్లలకి తల్లితండ్రులిద్దరి ప్రేమ, సపోర్ట్ కావాలి.. మిస్సింగ్ నివిష్క, నివిత్రి అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అంటే దీనిని బట్టి కళ్యాణ్ దేవ్ తమ కూతుర్ని(కూతుళ్ళని) ఎంతగా మిస్ అవుతుందో అనేది స్పష్టమవుతుంది. 

Kalyan Dev Emotional About His Daughter:

Kalyan Dev Emotional About His Daughter

Tags:   KALYAN DEV
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement