Advertisementt

అవే మనల్ని దూరం చేశాయంటూ సమంత పోస్ట్

Sat 06th May 2023 11:24 AM
samantha  అవే మనల్ని దూరం చేశాయంటూ సమంత పోస్ట్
Samantha Post Viral After Naga Chaitanya Comments On divorce అవే మనల్ని దూరం చేశాయంటూ సమంత పోస్ట్
Advertisement
Ads by CJ

విడాకుల విషయంలో నాగ చైతన్య ఇప్పటివరకు ఎక్కడా స్పందించకపోయినా.. కష్టడి ప్రమోషన్స్ లో నాగ చైతన్య కి ఎదురయ్యే ప్రశ్నలకి పర్ఫెక్ట్ గా క్లారిటీ ఇచ్చాడు. సమంత చాలా మంచి అమ్మాయి. ఆమె నాతో ఉన్నంత కాలం బాగా చూసుకున్నాను. రెండేళ్ల క్రితమే విడిపోయినా.. ఏడాది క్రితమే అధికారికంగా విడాకులొచ్చాయి. మీడియాలో జరిగిన ప్రచారాల వలనే మేము విడిపోయాము. ముందు పట్టించుకోకపోయినా.. తర్వాత పరిస్థితులకి తలొగ్గాము అంటూ నాగ చైతన్య సమంత తో విడాకుల విషయం తేల్చేసాడు. 

అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన కొద్ది గంటలకే సమంత ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. నాగ చైతన్య పోస్ట్ కి రిలేటెడ్ గా సమంత పోస్ట్ పెట్టినప్పటికీ ఎక్కడా విడాకుల విషయం ప్రస్తావించలేదు. మనమంతా ఒక్కటే... కేవలం అహంకారాలు, భయాలే మనల్ని దూరం చేసాయి.. అంటూ కొటేషన్ పెట్టడంతో.. నిజంగానే సమంత-నాగ చైతన్య మధ్యలో ఈగో క్లాషెస్ ఏర్పడి అది పెద్దదై విడాకులకు కారణమయ్యిందా..

మీడియాలో నాగ చైతన్య-సమంత లపై జరిగిన ప్రచారమే వాళ్ళు డివోర్స్ తీసుకునేలా చేసిందా.. ఇక్కడ ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో అనేది తెలికపోయినా.. వాళ్లిద్దరూ మళ్ళీ కలిసి ఉంటే చూడాలనుకునే అభిమానులు చాలామంది ఉన్నారు. కానీ సమంత-నాగ చైతన్య కలవడమనేది కల్లే అనుకునేలా కొన్ని విషయాలు జరిగాయి, జరుగుతున్నాయి.

Samantha Post Viral After Naga Chaitanya Comments On divorce:

Samantha Post Goes Viral 

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ