హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ ని ముగించేసి ఇమ్మిడియట్ గా పవన్ కళ్యాణ్ సుజిత్ OG సెట్స్ లోకి ఎంటర్ అయ్యారు. సుజిత్ తో ముంబై లో షూటింగ్ చేసిన పవన్ తదుపరి షెడ్యూల్ పూణే లో చేస్తున్నారు. అయితే OG నుండి పవన్ కళ్యాణ్ మళ్ళీ క్రిష్ హరి హర వీరమల్లు సెట్స్ లోకి వెళతారని ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే హరీష్ శంకర్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తో కలిసి లొకేషన్స్ చూపిస్తూ నెక్స్ట్ షెడ్యూల్ ప్రిపరేషన్ అన్నాడు.
ఈరోజు Cant wait to get in to action of second schedule 😍😍😍😍 #మనల్ని ఎవడ్రా ఆపేది ??!!!! అంటూ హరీష్ శంకర్ అదిరిపోయే రేంజ్ లో ట్వీటేసాడు. అందరూ హరీష్ శంకర్ ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాడని అనుకున్నారు. అంటే పవన్ హరి హర వీరమల్లు షూటింగ్ ఏం చేస్తారో అనే అనుమానం మొదలైంది. ఇంతలోపులో పవన్ కళ్యాణ్ నుండి హరీష్ శంకర్ కి అన్ ఎక్స్పెక్టేడ్ కాల్ వచ్చింది. దానితో సెకండ్ షెడ్యూల్ కి హరీష్ రెడీ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో హడావిడి.
ఏప్రిల్ 15 న ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ మొదలు కాబోతుంది కాబట్టే హరీష్ శంకర్ ఉత్సాహంతో ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ కాన్ఫిడెన్స్ తో ట్వీట్ వేసాడని అంటున్నారు. దీనినిబట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు పక్కనబెట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అవ్వబోతున్నారన్నమాట.




నవ్వించడం కష్టం, ఏడిపించడం సులువు: అల్లరి 

Loading..