పూణెకి పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూణే కి వెళుతున్నది ఏ వెకేషన్ కో కాదండోయ్.. ఆయన ఈ మధ్యన వరస సినిమా షూటింగ్స్ తో నానా హంగామా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిన్నపాటి గ్యాప్ తీసుకోకుండా షూటింగ్స్ కి హాజరవుతున్నారు. మూడు సినిమాల షూటింగ్స్ ఏక కాలంలో పూర్తి చేసే తొందరలో పవన్ ఉన్నారు. ఈ ఏడాది చివరికల్లా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు, OG షూటింగ్స్ కంప్లీట్ చేసే యోచనలో ఉన్నారు. ప్రెజెంట్ ముంబైలో OG షూట్ లో పాల్గొంటున్నారు.
సుజిత్ పవన్ కళ్యాణ్-హీరోయిన్ ప్రియాంక మోహన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. ఇప్పుడు OG షూట్ ముంబై నుండి పూణే కి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తుంది. పూణే లో చిన్నపాటి షెడ్యూల్ కంప్లీట్ చేసి పవన్ హరి హర వీరమల్లు సెట్స్ లోకి వెళతారని తెలుస్తుంది. OG షూట్ మొత్తం ముంబై, పూణే పరిసర ప్రాంతాల్లోనే సుజిత్ ప్లాన్ చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఇలా అవుట్ డోర్ వెళ్లాల్సి వచ్చింది.
ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్ ఎడిటింగ్ లోకి దిగిపోయాడు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవర్ ఫుల్ అప్ డేట్ ఆన్ ద వే అంటూ మేకర్స్ ఇచ్చిన ప్రకటనతో ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
OG next schedule in Pune
Pawan Kalyan heads to Pune






































