ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Saif Ali Khan Official Entry For NTR 30

అఫీషియల్: NTR30 లోకి సైఫ్ ఎంట్రీ

#NTR30 ఓపెనింగ్ కి ముందు సైఫ్ అలీ ఖాన్ #NTR30 విలన్ గా ఎంపిక అయ్యారు. కొరటాల శివ పాన్ ఇండియా ప్లాన్స్ లో భాగంగా సైఫ్ అలీ ఖాన్ ని తెలుగు తెరకి భారీ విలన్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనే టాక్ నడిచినా.. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ #NTR30 లో చెయ్యనన్నారు అంటూ గాలి వార్త పుట్టించి దానిని స్ప్రెడ్ చేసాయి కొన్ని మీడియా సంస్థలు. అప్పటినుండి ఎన్టీఆర్ ఫాన్స్ లో ఏదో తెలియని కన్ఫ్యూజన్.

ఆ కన్ఫ్యూజన్ కి తెర దించుతూ #NTR30 మేకర్స్ ఈ రోజు ఏప్రిల్ 18 న సైఫ్ అలీ ఖాన్ #NTR30 సెట్స్ లో జాయిన్ అయినట్లుగా ఆయనకి వెల్ కామ్ చెబుతూ ఎన్టీఆర్, కొరటాల తో సైఫ్ అలీ ఖాన్ ముచ్చటిస్తున్న పిక్స్ తో అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేసారు. సైఫ్ అలీ ఖాన్ #NTR30 లోకి ఎంటర్ అవడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. జాన్వీ కపూర్ బాలీవుడ్ నుండి తెలుగులోకి #NTR30 తో ఇంట్రడ్యూస్ అవడం, సైఫ్ జాయిన్ అవడంతో పై ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ప్రస్తుతం శంషాబాద్ దగ్గర వేసిన సముద్రం సెట్స్ లో #NTR30 షూటింగ్ జరుగుతుంది. ఎక్కువగా నైట్ షూట్ జరగడంతో ఎన్టీఆర్ కూడా డే అండ్ నైట్ ఈ ప్రోజెక్ట్ కోసం కష్టపడుతున్నాడని అంటున్నారు. అందుకే రీసెంట్ గా సెంథిల్ ఇచ్చిన ఆర్.ఆర్.ఆర్ పార్టీకి ఎన్టీఆర్ హాజరవలేదని తెలుస్తుంది.

Team NTR30 Welcomes Saif Ali Khan Onboard

Saif Ali Khan Official Entry For NTR 30
ntr30
saif ali khan