Advertisementt

అల్లు ఫాన్స్ ఆదుకోండి

Sat 15th Apr 2023 10:20 AM
shaakuntalam,allu fans  అల్లు ఫాన్స్ ఆదుకోండి
Support Allu fans అల్లు ఫాన్స్ ఆదుకోండి
Advertisement
Ads by CJ

ఇప్పుడు శాకుంతలం సినిమాని అల్లు ఫాన్స్ ఆదుకోకపోతే మేకర్స్ అన్యాయమైపోతారు. ఎప్పుడూ లేనటువంటి, రానటువంటి నెగెటివ్ టాక్ శాకుంతలానికి వచ్చేసింది. సమంత ని చూసి కూడా థియేటర్స్ కి వెళ్లే పరిస్థితి లేదు. ఈ వీకెండ్ కూడా థియేటర్స్ బోసి పోతున్నాయి. 100 పెర్సెంట్ ఆక్యుపెన్సీ ఎక్కడా కనిపించడం లేదు. శాకుంతలంలో ఆఖరికి సమంత కూడా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. 

అయితే క్లైమాక్స్ లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ సీన్స్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్ల అయినా ఎలాంటి బెరుకు లేకుండా కెమెరాలముందు కనిపించడమే కాదు.. ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్నట్టుగా నటించేసింది. డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పడం అందరికి నచ్చేసింది. అర్హ నటనకు అందరూ క్లాప్స్ కొడుతున్నారు. శాకుంతలంలో మెయిన్ హైలెట్, ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ అల్లు అర్హనే అంటున్నారు.

మరి అర్హ కోసమైనా అల్లు ఫాన్స్ శాకుంతలాన్ని ఆదరిస్తే మేకర్స్ గట్టెక్కుతారు. హా ఐదు నిముషాలు అర్హ కోసం మూడు గంటలు సినిమాని భరించాలా అంటే శాకుంతలం పని అవుట్. అసలే మౌత్ టాక్ బ్యాడ్ గా నడుస్తుంది, పూర్ రివ్యూస్ అన్ని కలిసి కట్టుగా శాకుంతలాన్ని పడుకోబెట్టేస్తాయి. 

Support Allu fans:

Please Support Shaakuntalam Allu fans

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ