Advertisementt

తారక్ పార్టీలో కనిపించని చరణ్

Thu 13th Apr 2023 05:42 PM
ram charan,jr ntr,rrr,ntr party  తారక్ పార్టీలో కనిపించని చరణ్
No Ram Charan in Young Tiger NTR Party తారక్ పార్టీలో కనిపించని చరణ్
Advertisement
Ads by CJ

ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఎవరికి వారే అయ్యారా, ఎందుకంటే వారి మధ్యన దూరం బాగా కనిపించేస్తుంది. మూడేళ్ళ కాలంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఎక్కువగా కలిసే కనిపించారు. RRR ప్రమోషన్స్ లో.. నిన్నటి ఆస్కార్ వరకు వారిద్దరూ కలిసి కనిపించారు. కానీ ఆస్కార్ తర్వాత వారు కలిసి కనబడిన సందర్భం లేదు. రామ్ చరణ్ బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీస్ వచ్చినా అందులో ఎన్టీఆర్ కనిపించలేదు. 

నిన్న రాత్రి ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన పార్టీలో రాజమౌళి కనిపించారు కానీ రామ్ చరణ్ కనిపించలేదు. ఎన్టీఆర్ గత రాత్రి తన ఇంట్లోనే అదిరిపోయే పార్టీ ఇచ్చారు. ఎందుకు ఏమిటి అనే విషయం తెలియదు కానీ ఈ పార్టీకి చాలామందికి ప్రముఖులు హాజరయ్యారు. కొరటాల శివ మైత్రి మూవీస్ వారు, రాజమౌళి.. వీరితో పాటుగా అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రల్ ఈ పార్టీలో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. కానీ పార్టీలో రామ్ చరణ్ లేకపోవడం మెగా ఫాన్స్ వెలితిగా ఫీలవుతున్నారు.

నా ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళతో ఈ సాయంత్రం ఆహ్లాదంగా గడిచింది. పార్టీకి వచ్చినందుకు థాంక్స్ జేమ్స్ అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఈ పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి స్పెషల్ గా కనిపించింది. పార్టీకి హాజరయిన ప్రముఖులతో ఎన్టీఆర్ సందడి చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

No Ram Charan in Young Tiger NTR Party:

Mr NTR.. Where is Ram Charan?

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ