Advertisementt

మెగా డైరెక్టర్ తో సూపర్ స్టార్

Wed 12th Apr 2023 01:17 PM
dil raju,rajinikanth  మెగా డైరెక్టర్ తో సూపర్ స్టార్
Super star with mega director మెగా డైరెక్టర్ తో సూపర్ స్టార్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఈ మధ్యన అసాధ్యమయ్యే కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీని నిర్మిస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబోని, అసలు ఊహకి అందని సెట్ చేసినట్లుగా తెలుస్తుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో తెలుగు దర్శకుడితో సినిమా ప్లాన్ చెయ్యడం. ఇంతకుముందు స్టార్ హీరో విజయ్ తో వంశి పైడిపల్లి దర్శకత్వంలో వారిసుని నిర్మించిన దిల్ రాజు.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ని పట్టేశారట.

మెగాస్టార్ వాల్తేర్ వీరయ్యతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు బాబీకి దిల్ రాజు.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి నిజంగా ఈ కాంబో సెట్స్ మీదకి వెళితే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో.. దిల్ రాజు తెలివితేటలు మరోసారి ప్రూవ్ అవుతాయి. మరి ఈ కాంబో ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ వెయిట్ చేసేలా ఈ అనౌన్సమెంట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం బాబీ ఖాళీగానే ఉన్నప్పటికీ.. రజినీకాంత్ నెల్సెన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అలాగే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రాబోతున్న లాల్ సలామ్ లో గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు.

Super star with mega director:

Dil Raju planning a movie with Rajinikanth

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ