Advertisementt

బాలీవుడ్ అంటే మక్కువేం కాదు

Mon 10th Apr 2023 10:07 PM
samantha,shaakuntalam  బాలీవుడ్ అంటే మక్కువేం కాదు
Samantha replies Shaakuntalam poor promotions బాలీవుడ్ అంటే మక్కువేం కాదు
Advertisement
Ads by CJ

శాకుంతలం ప్రమోషన్స్ ని తెలుగులో వదిలేసి.. బాలీవుడ్ లో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. అసలు సిసలైన తెలుగు ప్రేక్షకులల్లోకి శకుంతలాన్ని తీసుకెళ్లాల్సింది పోయి.. ఇలా చేస్తున్నారేమిటి అంటూ చాలామంది అంటున్న మాట. గుణశేఖర్, సమంత, దిల్ రాజు, నీలిమ గుణ వీళ్లంతా హైదరాబాద్ ని వదిలేసి.. ఎక్కువగా ముంబైలో కనిపించడంపై చాలారకాల కామెంట్స్ పడుతున్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ లో శాకుంతలం క్వచ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రెస్ మీట్ లో సమంతని అదే ప్రశ్న వేశారు.

మీరు బాలీవుడ్ కి ఇచ్చినంత ప్రాధాన్యత టాలీవుడ్ కి ఇవ్వడం లేదు అని అడగ్గానే.. అందుకు సమంత స్పందిస్తూ నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. కొచ్చిలో విజయ్ దేవరకొండ తో ఖుషి షూటింగ్ జరుగుతుంది. అప్పుడు అక్కడ శాకుంతలం ప్రమోషన్స్ చేసాము. తర్వాత హిందీలో సిటాడెల్ షూటింగ్ జరుగుతుంది. ముంబైలో ఉన్నప్పుడు అక్కడ శాకుంతలం ప్రమోషన్స్ చేశాను. అంతేగానీ టాలీవుడ్ మీద తక్కువప్రేమ, బాలీవుడ్ పై ప్రత్యేకమైన ప్రేమేం లేదు అంటూ సమాధానమిచ్చింది.

ఆ తర్వాత దిల్ రాజు మ్యానేజ్ చేస్తూ తెలుగుని లైట్ తీసుకున్నామన్నది పొరబాటు, నిర్మాతగా నేను ఎలా డిజైన్ చేస్తే అలా ప్రమోషన్స్ ఉంటున్నాయి. సమంత వెసులుబాటుని బట్టి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాము, ప్రెజెంట్ తెలుగులోనే ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేస్తున్నామంటూ కవర్ చేసారు.

Samantha replies Shaakuntalam poor promotions:

Samantha Ruth Prabhu replies Shaakuntalam poor promotions

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ