బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా సీతారామం చిత్రాన్ని మలచి ప్రేక్షకులతో కంట తడి పెట్టించిన హను రాఘవపూడిని మెచ్చినవారే కాని మెచ్చని వారు లేరు. పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రతి భాషా ప్రేక్షకుడి మనసుని తాకింది. అద్భుత దృశ్య కావ్యంగా నిలిచిన సీతారామంలో సీత, రామ్ కేరెక్టర్స్ లో దుల్కర్, మృణాల్ ఠాకూర్ ప్రాణం పెట్టేసారు. సీత అనగానే మృణాల్ గుర్తొచ్చేలా ఆమె పాత్ర తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. సింపుల్ గా, బ్యూటిఫుల్ గా, ఎమోషనల్ గా సీత కేరెక్టర్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యింది.
ఆ అద్భుత దృశ్యకావ్యానికి సీక్వెల్ ఉంటుందా అని మృణాల్ ని అడిగితే దానికి ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది. తాజాగా వెకేషన్స్ లో బికినీ షో చేస్తూ గ్లామర్ గా కనువిందు చేసిన మృణాల్ ఠాకూర్ #AskMrunal అంటూ అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగానే ఓ నెటిజెన్ సీతారామం 2 సాధ్యమేనా.. అంటూ ప్రశ్న వేసాడు. దానికి మృణాల్ ఠాకూర్ నాకు నిజంగా సీతారామం 2 పై ఎలాంటి ఆలోచన లేదు.. ఒకవేళ ఆ చిత్రానికి సీక్వెల్ ఉంటే.. అందులో నేను ఉండాలనుకుంటున్నాను అంటూ ఆన్సర్ ఇచ్చింది.
సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ తెలుగులో మిగతా లాంగ్వేజెస్ లో బిజీ అవుతుంది అనుకున్నారు. ప్రస్తుతం హిందీ మూవీస్ తో పాటుగా.. తెలుగులో నానితో కలిసి #Nani30లో నటించబోతుంది. త్వరలోనే #Nani30 సెట్స్ లో జాయిన్ కాబోతుంది.