Advertisement

సలార్ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్

Fri 24th Mar 2023 12:13 PM
salaar,prabhas  సలార్ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్
Salaar is not a pan India.. pan world movie సలార్ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్
Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో మాస్ మసాలా మూవీగా పాన్ ఇండియాలోని తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో తెరకెక్కుతున్న సలార్ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే సలార్ షూటింగ్ చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు సలార్ పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ వరల్డ్ మూవీగా సెప్టెంబర్ 28న రిలీజ్ కి రెడీ అవుతుంది అనే న్యూస్ తో ప్రభాస్ ఫాన్స్ పిచ్చ హ్యాపీ మోడ్ లోకి వెళుతున్నారు.

ఇండియన్ లాంగ్వేజెస్‌లోనే కాకుండా స‌లార్ ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను సిద్ధం చేయబోతున్నారట మేకర్స్. దానితో సలార్ అంతర్జీయ మర్కెట్ లోకి అడుగుపెడుతుంది అంటున్నారు. దానిలో భాగంగానే హాలీవుడ్ ఆడియన్స్ కి ఎక్కేలా.. ఇండియాలో విడుద‌లయ్యే వెర్ష‌న్‌లో ఉండే పాట‌లు, కామెడీ స‌న్నివేశాలు లేకుండా స‌లార్ ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను సిద్ధం చేస్తున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని వ‌ల్ల ఇంగ్లీష్ వెర్ష‌న్ వ్య‌వ‌ధి ముప్పై నిమిషాలు త‌గ్గింద‌నేది విశ్వ‌స‌నీయ స‌మాచారం.

భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఇండియన్ మర్కెట్ తో పాటుగా హాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చెయ్యడం మాములు విషయం కాదు.. ఇకపై ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్ అంటూ ప్రభాస్ ఫాన్స్ అప్పుడే ఊహల్లోకి వెళ్లిపోతున్నారు.

Salaar is not a pan India.. pan world movie:

Salaar is not a Pan-India Movie, it's Pan-World Movie

Tags:   SALAAR, PRABHAS
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement