Advertisementt

చాలా రోజుల తర్వాత యాంకర్ వర్షిణి ఇలా

Wed 22nd Mar 2023 08:18 PM
anchor varshini,star maa ugadi  చాలా రోజుల తర్వాత యాంకర్ వర్షిణి ఇలా
Anchor Varshini like this after many days చాలా రోజుల తర్వాత యాంకర్ వర్షిణి ఇలా
Advertisement

గతంలో ఈటివి డాన్స్ షోలో మెంటర్ గా, అలాగే కొన్ని ఫెస్టివల్ షోస్ కి యాంకర్ గా గ్లామర్ షో చేసిన వర్షిణి.. ఈమధ్య కాలంలో ఛానల్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. ఛానల్స్ లో హడావిడి లేదు, ఇక ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లోను అస్సలు కనిపించకపోవడంతో వర్షిణి పెళ్లి చేసుకోబోతుందేమో అందుకే యాంకరింగ్ చెయ్యడం లేదు అనుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్ గా ఏమైనా ట్రై చేస్తుందేమో అనుకున్నారు. ఎందుకంటే గ్లామర్ షో తో వర్షిణి అదరగొట్టేసేది. అయితే Etv డాన్స్ షో నుండి తప్పుకున్న కొత్తల్లో వర్షిణి బాగా బరువు పెరిగింది. ఆమె బుల్లితెర మీద గ్లామర్ గా కన్నా బరువుగా కనిపించడంతోనే ఆమె కొన్నాళ్ళు టీవీ షోస్ కి గ్యాప్ ఇచ్చి వెయిట్ లాస్ అయ్యే పనిలో ఉంది అనుకుంటున్నారు.

అయితే చాన్నాళ్ల తరవాత వర్షిణి స్టార్ మా వేదికపై సందడి చేసింది. స్టార్ మా వేదికగా ఉగాది ఫెస్టివల్ ప్రోగ్రాంలో మెరిసింది. యాంకర్ రవితో కలిసి వర్షిణి..మా ఇంటి పండుగ ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసింది. గ్లామర్ గా వర్షిణి రవితో కలిసి స్టార్ మా స్టేజ్ పై సందడి చెయ్యడంతో ఆమె అభినులు హ్యాపీ గా ఫీలవుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందంగా, బరువు తగ్గి గ్లామర్ గా కనిపించిన వర్షిణి ఇలా షోస్ తో బిజీ అవ్వాలని ఆమె ఫాన్స్ కోరుకుంటున్నారు.

ఇంకా ఈ ఈవెంట్ లో రావణాసుర ప్రమోషన్స్ కోసం రవితేజ, దసరా ప్రమోషన్స్ కోసం నాని కూడా వచ్చి ఎంటర్టైన్ చెయ్యగా.. స్టార్ మా సీరియల్ నటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా స్టార్ మా స్టేజ్ పై తమ తమ ఫామిలీస్ తో కలిసి రచ్చ రచ్చ చేసారు.

Anchor Varshini like this after many days:

Anchor Varshini at Star Maa Ugadi Special Event 2023

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement